Begin typing your search above and press return to search.

ఆఫర్స్ కాదు వరుణ్.. కంటెంట్ చూస్కో

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హిట్లు ఫ్లాప్​లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ కెరీర్​లో ముందుకు వెళ్లిపోతున్నారు

By:  Tupaki Desk   |   30 Aug 2023 7:46 AM GMT
ఆఫర్స్ కాదు వరుణ్.. కంటెంట్ చూస్కో
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హిట్లు ఫ్లాప్​లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ కెరీర్​లో ముందుకు వెళ్లిపోతున్నారు. ఒకే రకమైన సినిమాలు చేస్తూ స్టార్ ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా డిఫరెంట్​ కాన్సెప్ట్​ కథలు ఎంచుకుంటూ ముందుకెళ్తున్నారని అనే గుర్తింపు కూడా పొందారు. ముకుంద.. తన తొలి సినిమాతోనే ఒక ప్రయోగంగా చేసిన వరుణ్ తేజ్ ఆ తర్వాత కంచె, అంతరిక్షం వంటి సినిమాలతో పాటు తాజాగా వచ్చిన గాండీవధారి అర్జున వరకు తన ఎక్స్​పెరిమెంట్​ పంథాను కొనసాగించారు.

అయితే ఇప్పుడు ఈ ప్రయోగాత్మక సినిమాలన్ని ఎంత వరకు సక్సెస్​ అయ్యాయనే విషయానికొస్తే.. ఇందులో చాలా చిత్రాల వరకు అన్నీ ఫ్లాప్​లుగానే నిలిచాయి. అప్పుడప్పుడు మధ్యలో ఫిదా, గద్దలకొండ గణేశ్, ఎఫ్​ 2, ఎఫ్​ 3 సినిమాలు మాత్రం ఆడాయి. ఇక వరుణ్ నటించిన గత రెండు సినిమాలైతే దారణమైన పరాజయాలను అందుకున్నాయి. నిర్మాతలకు భారీ నష్టాల్ని మిగిల్చాయి.

బాక్సింగ్-మార్షల్​ ఆర్ట్స్​ నేపథ్యంలో వచ్చిన గని అట్టర్​ఫ్లాప్ అయ్యింది. అల్లు బాబీ కంపెనీ, రినైస్సెన్స్ పిక్చ‌ర్స్ కలిసి ఈ సినిమాను నిర్మించారు. దాదాపు రూ.25కోట్ల బడ్జెట్​తో భారీ హైప్​ క్రియేట్​ చేస్తూ వచ్చిన ఈ చిత్రం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. కానీ నిర్మాతలు అల్లు బాబీ, సిద్ధుకు నష్టం చేకూర్చింది. ఉపేంద్ర‌, సునీల్‌శెట్టి, న‌వీన్‌చంద్ర‌ లాంటి స్టార్​ కాస్ట్​ ఉన్నా సినిమాకు అస్సలు ప్లస్​ కాలేకపోయింది. కథలో దమ్ము లేకుండటం వల్ల ప్రేక్షకులు డిజాస్టర్​ను అందించారు. దీంతో వరుణ్​.. నష్టపోయిన తన నిర్మాతలకు మరో సినిమా చేస్తానని మాట ఇచ్చారు.