Begin typing your search above and press return to search.

వైరల్‌ వీడియో : మెగా ప్రిన్స్ క్లింకార ఫస్ట్‌ విజువల్స్‌

అయితే ఇప్పటి వరకు క్లింకార ఎలా ఉంది అనే విషయాన్ని మెగా ఫ్యామిలీ రివీల్‌ చేయలేదు.

By:  Tupaki Desk   |   27 March 2024 4:55 AM GMT
వైరల్‌ వీడియో : మెగా ప్రిన్స్ క్లింకార ఫస్ట్‌ విజువల్స్‌
X

మెగాస్టార్‌ చిరంజీవి మనవరాలు క్లింకార పుట్టిన వెంటనే వార్తల్లో నిలిచిన విషయం తెల్సిందే. జాతీయ స్థాయి మీడియాలో సైతం క్లింకార కి ప్రత్యేకంగా స్థానం దక్కింది. అయితే ఇప్పటి వరకు క్లింకార ఎలా ఉంది అనే విషయాన్ని మెగా ఫ్యామిలీ రివీల్‌ చేయలేదు.

అధికారికంగా క్లింకార ఫోటోలు వీడియోలు రివీల్‌ చేయలేదు కానీ నేడు రామ్‌ చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ కి మరియు సోషల్‌ మీడియా జనాలకు క్లింకార ఫేస్ ను చూసే అవకాశం దక్కింది. నేడు చరణ్‌, ఉపాసన ఇతర కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ఆ సందర్భంగా ఉపాసన ఒడిలో క్లింకార ఉంది. మీడియా వారు మెగా ఫ్యామిలీని కవర్‌ చేస్తున్న సమయంలో క్లింకార ఫేస్ రివీల్‌ అయ్యింది. కొన్ని సెకన్ల ఆ వీడియో లో క్లింకార ఎంతో క్యూట్‌ గా కనిపిస్తుంది. అంతే కాకుండా ఆమె చూపు లో మెరుపు ఉందని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.

మెగా ప్రిన్స్ క్లింకార ఫస్ట్‌ విజువల్స్ అంటూ ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. క్లింకార క్యూట్‌ లుక్ కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియో క్లింకార ఫేస్ ను రివీల్‌ చేస్తుంది. ఇప్పుడు అయినా చరణ్‌ దంపతులు క్లింకార ఫేస్ ను అధికారికంగా రివీల్ చేస్తారేమో చూడాలి.