Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: మెగా ప్రిన్సెస్ డిజైన‌ర్ సొగ‌సు

ఇట‌లీలో డెస్టినేష‌న్ వెడ్డింగ్ లో వ‌రుణ్ తేజ్- లావ‌ణ్య దంప‌తుల‌తో నిహారిక ఆనందోత్సాహానికి సంబంధించిన ఫోటోలు ఇప్ప‌టికే అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి.

By:  Tupaki Desk   |   6 Nov 2023 7:24 AM GMT
ఫోటో స్టోరి: మెగా ప్రిన్సెస్ డిజైన‌ర్ సొగ‌సు
X

ఇట‌లీలో డెస్టినేష‌న్ వెడ్డింగ్ లో వ‌రుణ్ తేజ్- లావ‌ణ్య దంప‌తుల‌తో నిహారిక ఆనందోత్సాహానికి సంబంధించిన ఫోటోలు ఇప్ప‌టికే అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. నిహారిక ఈ శుభ‌సంద‌ర్భంలో అన్నా వ‌దిన‌ల‌తో త‌న జాయ్ ఫుల్ క్ష‌ణాల‌ను ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అయ్యాయి. హైదరాబాద్‌లో జరిగిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి రిసెప్షన్‌కు తెలుగు సినీ ప్రముఖులు హాజరు కాగా కొన్ని ఐకానిక్ ఫోజుల్లో నిహారిక ఎంతో అందంగా క‌నిపించింది.


ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన వివాహ రిసెప్షన్‌కు తెలుగు సినిమా నుండి చాలా మంది ప్రముఖులు హాజరు కాగా.. వరుణ్ కుటుంబం నుండి, నిహారిక కొణిదెల - తల్లిదండ్రులు నాగేంద్ర బాబు - పద్మజ కొణిదెల స‌హా ఇత‌ర బంధుమిత్రులు ఈ ఫోటోల్లో క‌నిపించారు. నిహారిక కొణిదెల నూతన వధూవరులతొ కలిసి పోజులిచ్చారు.

మ‌రోవైపు నిహారిక ఎక్స్ క్లూజివ్ ఫోటోషూట్ ఇప్పుడు అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తోంది. ఈ ఫోటోషూట్ లో నిహారిక స‌మ్మోహ‌న రూపం మైమ‌రిపిస్తోంది. డిజైన‌ర్ చీర‌లో మెగా ప్రిన్సెస్ సొగ‌సు ఆ జాయ్ యువ‌త‌రంలో జోష్ నింపింది. క్రిస్ట‌లైన్ ప‌ర్పుల్ క‌ల‌ర్ చీర‌లో నిహారిక ముగ్ధ మ‌నోహ‌ర రూపం క‌ట్టి ప‌డేస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది.

టాలీవుడ్ లో అరుదైన ప్ర‌తిభావ‌ని నిహారిక‌. యాంక‌ర్ గా, క‌థానాయిక‌గా, నిర్మాత‌గా రాణించిన నిహారిక ఇటీవ‌ల తిరిగి త‌న న‌ట‌నా కెరీర్ ని పున‌రుద్ధ‌రించే ప‌నిలో ఉంది. మునుముందు న‌టిగా బిజీ అవుతూనే నిర్మాత‌గాను కొన‌సాగ‌నుంద‌ని టాక్ వినిపిస్తోంది. నిహారిక ఇటీవ‌ల‌ త‌న జీవిత ల‌క్ష్యాల‌ను సాధించుకునే మార్గంలో ఉంది. న‌ట‌న అంటే త‌న‌కు ఎప్పుడూ ఇష్టం. తిరిగి దానిని కొన‌సాగిస్తోంది. నిహారిక కంబ్యాక్ అద్భుతంగా ఉండాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. నిహారిక మునుముందు కెరీర్ కోసం ఎలాంటి ప్ర‌ణాళిక‌ల్ని సిద్ధం చేస్తున్నారో వెల్ల‌డించాల్సి ఉంది.