Begin typing your search above and press return to search.

ఎక్స్ ప్రెస్ ని దించేస్తోన్న మెగా వార‌సుడు!

మేర్లపాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా కి లాక్ అయ్యాడు.

By:  Tupaki Desk   |   1 April 2024 9:50 AM GMT
ఎక్స్ ప్రెస్ ని దించేస్తోన్న మెగా వార‌సుడు!
X

మెగా వార‌సుడు వ‌రుణ్ తేజ్ కి అవ‌కాశాల‌కు కొద‌వ‌లేదు. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా కొత్త అవ‌కాశాలు అందుకుంటున్నాడు. ఇటీవ‌లే రిలీజ్ అయిన 'ఆప‌రేష్ వాలంటైన్' కూడా ఆశించిన ఫ‌లితాన్నివ్వ‌ని సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాపై వ‌రుణ్ చాలా ఆశ‌లే పెట్టుకున్నాడు గానీ ప‌న‌వ్వ‌లేదు. ప్ర‌స్తుతం 'మ‌ట్కా' అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. ఇది షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో కొత్త‌సినిమాకి సైన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. మేర్లపాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా కి లాక్ అయ్యాడు.


ఇటీవ‌లే ఆయ‌న వినిపించిన క‌థ న‌చ్చ‌డంతో మ‌రో ఆలోచ‌న లేకుండా క‌మిట్ అయిన‌ట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఫ‌స్ట్ ప్రేమ్ ఎంట‌ర్ టైన్ మెంట్స్-యూవీ క్రియేష‌న్స్ సంస్థ‌లు నిర్మిస్తున్నాయ‌ని స‌మాచారం. మ‌ట్కా సినిమా పూర్తిక‌గానే వ‌రుణ్ ఈ సినిమానే ప‌ట్టాలెక్కించ‌నున్నాడు. ఇక మేర్ల‌పాక ఏడాదిగా ఖాళీగానే ఉంటున్నాడు. ఆయ‌న చివ‌రిగా 2022 లో లైక్ షేర్ సబ స్క్రైబ్ అనే చిత్రాన్ని తెర‌కెక్కించాడు. కానీ ఈ సినిమా ఆశించిన ఫ‌లితం సాధించ‌లేదు. `వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్` తో మేర్ల‌పాక ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే.

ఆ సినిమా మంచి విజ‌యం సాధించింది. అ త‌ర్వాత ఎక్స్ ప్రెస్ రాజా అంటూ మ‌రో సినిమా చేసాడు. అది బాగానే ఆడింది. ఇక `కృష్ణార్జున యుద్దం` నుంచి కష్టాలు మొద‌ల‌య్యాయి. నానితో తీసిన కృష్ణార్జున యుద్దం ప్లాప్ అయింది. ఆ త‌ర్వాత `ఏక్ మినీ క‌థ`..`మ్యాస్ట్రో` తెర‌కెక్కించాడు. రెండు సినిమాలు నిరాశ‌నే మిగిల్చాయి. ఆ త‌ర్వాత తీసిన సినిమా కూడా ఆశించిన ఫ‌లితం అందించ‌లేదు. దీంతో గ్యాప్ త‌ప్ప‌లేదు. ఏడాది గ్యాప్ అనంత‌రం వ‌రుణ్ తేజ్ ని మెప్పించాడు.

ఈ సినిమా విజ‌యం గాంధీకి అత్యంత కీల‌కం. ర‌చ‌యిత‌గానూ గాంధీకి మంచి పేరుంది. మరి వ‌రుణ్ కోసం ఎలాంటి స్టోరీ రాసాడు? అన్న‌ది తెలియాలి. అలాగే వ‌రుణ్ ప్ర‌స్తుతం న‌టిస్తోన్న `మ‌ట్కా`పైనా చాలా ఆశ‌లే పెట్టుకున్నాడు. ఇది పాన్ ఇండియాలో చేస్తోన్న చిత్రం. ఆయ‌న కెరీర్ లోనే తొలి భారీ బ‌డ్జెట్ చిత్ర‌మిది. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కుతోన్న సినిమా ఇది.