Begin typing your search above and press return to search.

మరో పుకారు.. చరణ్ ని వీడని తమిళ్ మీడియా

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరో. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ స్థాయి అమాంతం పెరిగింది

By:  Tupaki Desk   |   16 Oct 2023 12:54 PM IST
మరో పుకారు.. చరణ్ ని వీడని తమిళ్ మీడియా
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరో. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ స్థాయి అమాంతం పెరిగింది. అందుకే ఆయనతో సినిమా చేసేందుకు అన్ని భాషల ఫిలిం మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అంతే కాకుండా అన్ని భాషల మీడియా సంస్థలు కూడా చరణ్ పై ప్రత్యేకంగా దృష్టి సారించాయి. రామ్ చరణ్ కి సంబంధించిన చిన్న విషయాన్ని కూడా ప్రధానంగా వారు కవరేజ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

తాజాగా రామ్ చరణ్ తమిళ్ సూపర్ స్టార్ విజయ్ సినిమా లియో లో కీలక పాత్రలు కనిపించబోతున్నాడు అంటూ తమిళ్ మీడియాలో వచ్చిన పుకారు జాతీయ స్థాయిలో సందడి చేసింది. లియో సినిమా యొక్క హైప్ పెంచేందుకుగాను చరణ్ గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడని పుకార్లను తమిళ్ మీడియా సృష్టించింది అంటూ కొందరు మెగా కాంపౌండ్ కు చెందిన వారు ఆఫ్ ది రికార్డు మాట్లాడుకుంటున్నారు. లియో సినిమాలో చరణ్ పాత్ర లేదు, చరణ్ కనిపించబోడు అంటూ స్పష్టతనిచ్చిన తర్వాత కూడా అక్కడ ఏదో రకంగా వార్తల్లో ముంచే ప్రయత్నం చేస్తున్నారు.

రామ్ చరణ్ గురించి మరో పుకారు తమిళ్ మీడియాలో సందడి చేస్తోంది. అదేంటి అంటే చరణ్ తో దర్శకుడు శంకర్ ప్రస్తుతం గేమ్ చేంజర్ అనే సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత వెంటనే ఇండియన్ 3 సినిమాను చరణ్తో చేసేందుకు శంకర్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు అనేది తమిళ్ మీడియాలో ఈ మధ్యకాలంలో వస్తున్న వార్తల సారాంశం. తమిళ్ మీడియా వారు ఈ విషయమై అత్యుత్సాహంతో భారీగా కథనాలను కల్లేస్తున్నారు.

ఇప్పటి వరకు అలాంటి చర్చలు ఏమీ జరగలేదని మెగా కాంపౌండ్ నుంచి ఈ విషయంలో కూడా క్లారిటీ వస్తుంది. తమిళ్ మీడియా పదేపదే రామ్ చరణ్ కి సంబంధించిన పుకార్లను పుట్టిస్తూ పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ విమర్శలు వ్యక్తం వుతున్నాయి. పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లుగా క్రేజ్ ఉన్న స్టార్ కే ఇలాంటి పుకార్లు.. కనుక చరణ్ ఫాన్స్ ఇలాంటివన్నీ లైట్ తీసుకుంటూ అధికారికంగా వచ్చిన వార్తలను మాత్రమే నమ్మాల్సిన అవసరం ఉంది.