Begin typing your search above and press return to search.

పెళ్లి త‌ర్వాత మెగా కోడ‌లు స్వేచ్ఛ‌గా!

పెళ్లికి ముందున్న ప్రాజెక్ట్ లు పూర్తి చేసిన త‌ర్వాత వ‌రుణ్ తేజ్ తో వివాహం జ‌ర‌గ‌డంతో ఆమె సినిమాల‌కు దూర‌మ‌య్యే అవకాశం ఉంద‌ని ప్ర‌చారం సాగింది.

By:  Tupaki Desk   |   3 Feb 2024 7:00 AM GMT
పెళ్లి త‌ర్వాత మెగా కోడ‌లు స్వేచ్ఛ‌గా!
X

పెళ్లి త‌ర్వాత మెగా కోడ‌లు లావ‌ణ్య త్రిపాఠి సినిమాలు చేస్తుందా? లేదా? అని చాలా సందేహాలు తెర‌పైకి వ‌చ్చాయి. పెళ్లికి ముందున్న ప్రాజెక్ట్ లు పూర్తి చేసిన త‌ర్వాత వ‌రుణ్ తేజ్ తో వివాహం జ‌ర‌గ‌డంతో ఆమె సినిమాల‌కు దూర‌మ‌య్యే అవకాశం ఉంద‌ని ప్ర‌చారం సాగింది. 'మిస్ ప‌ర్పెక్ట్' వెబ్ సిరీస్ కూడా పెళ్లికి ముందు క‌మిట్ అయింది కావ‌డంతో ఆసిరీస్ ని పూర్తి చేసి ప్ర‌చారం ప‌నులు పూర్తి చేసి త‌న బాధ్య‌త అయిపోతుంది.


అటుపై మెగా కోడ‌లు తెర‌పై క‌నిపించొచ్చు..క‌నిపించ‌క‌పోవ‌నువ‌చ్చు! అని ప‌లువురు భావించారు. కానీ లావ‌ణ్య త్రిపాఠి కెరీర్ విష‌యంలో త‌న‌కు పూర్తిగా స్వేచ్ఛ క‌ల్పించిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా ఆ విష‌యాన్ని మ‌రోసారి లావ‌ణ్య క‌న్ప‌మ్ చేసింది. `పెళ్లి త‌ర్వాత కెరీర్ ప‌రంగా ఎలాంటి మార్పు రాలేదు. మెగా కుటుంబ లోకి వ‌చ్చావు కాబట్టి నువ్వు ఇలా చేయాలి..అలా చేయాలి అని నాకు ఎవ్వ‌రూ ప‌రిమితులు పెట్ట‌డం లేదు.

కెరీర్ ప‌రంగా నాకు కావాల్సినంత స్వేచ్ఛ ఉంది. వ‌రుణ్ తేజ్ రూపంలో జీవితంలో బాగా అర్దం చేసుకునే భ‌ర్త దొరికాడు. ఇంత‌కు మించి నాకు ఏం కావాలి. మా వ‌ర‌కూ మేము అయితే ఎప్ప‌టిలాగే ఉన్నాం. నా సినిమాల విష‌యంలో వ‌రుణ్ పెద్ద‌గా క‌ల్పించుకోను. నేను ఏదైనా స్టోరీ చెబితే మాత్రం వింటాడు. త‌ను ఈ సిరీస్ చూసి బాగుంద‌ని మెచ్చుకున్నాడు` అని తెలిపింది. అలాగే పీపూల్ మీడియా ఫ్యాక్ట‌రీ లో ఓ సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

ఓ కొత్త ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడుట‌. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్త‌యిందిట‌. ఇందులో లావ‌ణ్య పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తుందిట‌. ఆమె వ్యాఖ్య‌ల్ని బ‌ట్టి లావ‌ణ్య సినిమా కెరీర్ కి ఎలాంటి ఢోకా లేద‌ని తేలిపోయింది. య‌ధావిధిగా ఆమె సినిమాలు చేస్తుంది. ఈ నేప‌థ్యంలో వ‌రుణ్ -లావ‌ణ్య జోడీని ఇప్పుడు వెండి తెర‌పై చూడాల‌ని ప్రేక్ష‌కాభిమానులంతా కోరుకుంటున్నారు.