Begin typing your search above and press return to search.

మెగా యంగ్ హీరోలకి ఇది పెద్ద దెబ్బె..

మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్, నెక్స్ట్ అల్లు అర్జున్, రామ్ చరణ్ తన బ్రాండ్ ఇమేజ్ ని పెంచుకున్నారు

By:  Tupaki Desk   |   6 March 2024 5:43 AM GMT
మెగా యంగ్ హీరోలకి ఇది పెద్ద దెబ్బె..
X

మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్, నెక్స్ట్ అల్లు అర్జున్, రామ్ చరణ్ తన బ్రాండ్ ఇమేజ్ ని పెంచుకున్నారు. ముఖ్యంగా చరణ్ బన్నీ పాన్ ఇండియా స్టార్స్ గా కొనసాగుతున్నారు. ఈ నలుగురు హీరోల మీద వంద కోట్లకి పైగా బడ్జెట్ పెట్టేందుకు నిర్మాతలు సిద్ధంగానే ఉంటారు. పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందనే నమ్మకంతో ఈ స్టార్స్ తో మూవీస్ చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. అయితే మెగా ఫ్యామిలీలో యంగ్ హీరోలుగా ఉన్న సాయి ధరమ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లకి ఆశించిన స్థాయిలో మార్కెట్ లేదు.

వీరి కెరియర్ లో కమర్షియల్ సక్సెస్ లు చాలా తక్కువ ఉన్నాయి. టైర్ 2 హీరోల జాబితాలో ఉన్న సాయి ధరమ్ తేజ్ చాలా గ్యాప్ తర్వాత విరూపాక్షతో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో కమర్షియల్ యాక్షన్ జోనర్ లో పీరియాడికల్ టచ్ తో గంజా శంకర్ అనే మూవీని ఎనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా బడ్జెట్ లెక్కలు వేసుకుంటే తేజ్ కి ఉన్న మార్కెట్ కంటే చాలా ఎక్కువ కనిపిస్తుందంట.

ఈ కారణంగా సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదని తెలుస్తోంది. విరూపాక్ష హిట్ అయిన ఆ క్రెడిట్ మొత్తం కథ, డైరెక్షన్ కి దక్కుతుంది. కమర్షియల్ మూవీ అంటే హీరో ఇమేజ్ మీదనే వెళ్ళాలి. అందుకే గంజా శంకర్ సినిమా బడ్జెట్ ఎక్కువ కనిపించడంతో నిర్మాతలు ఆలోచనలో పడ్డట్లు టాక్. ఇక వరుణ్ తేజ్ తాజాగా ఆపరేషన్ వాలంటైన్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.

ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షక స్పందన సొంతం చేసుకోలేకపోయింది. దీంతో వరుణ్ తేజ్ ఖాతాలో మూడో ఫ్లాప్ గా ఆపరేషన్ వాలంటైన్ చేరింది. గని వరకు వరుణ్ తేజ్ పైన మంచి బిజినెస్ జరిగింది. వరుస మూడు ఫ్లాప్ లతో మార్కెట్ దారుణంగా పడిపోయింది. నాన్ థీయాట్రికల్ రైట్స్ పరంగా కూడా వరుణ్ తేజ్ కి నెక్స్ట్ మూవీస్ విషయంలో ఇబ్బంది ఎదురుకావొచ్చు.

ప్రస్తుతం కరుణ కుమార్ దర్శకత్వంలో మట్కా అనే మూవీని వరుణ్ తేజ్ చేస్తున్నాడు. ఈ సినిమా పీరియాడికల్ జోనర్ లో 1958 నుంచి 1982 మధ్యలో జరిగే కథగా ఉండబోతోంది. ఈ మూవీ పేపర్ మీద బడ్జెట్ లెక్కలు వేసుకుంటే చాలా ఎక్కువగా కనిపిస్తుందని తెలుస్తోంది. దీంతో నిర్మాతలు ఆలోచనలో పడ్డారంట. వైష్ణవ్ తేజ్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. ఉప్పెన తర్వాత వైష్ణవ్ మూడు సినిమాలతో వచ్చాడు. అందులో ఒకటి కూడా హిట్ కాలేదు. దీంతో అతనికి ఆశించిన స్థాయిలో మార్కెట్ లేదు. ఈ కారణంగా నిర్మాతలు భారీ బడ్జెట్ ని మెగా యంగ్ హీరోల మీద పెట్టేందుకు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ పరిస్థితిని దాటాలి అంటే క్యారెక్టర్ తో ఇంపాక్ట్ చూపించే కథలను సెలెక్ట్ చేసుకొని బలమైన హిట్టు కొట్టాల్సిన అవసరం ఉంది. మరి ఆ దిశగా మెగా యువ హీరోలు ఎలాంటి కథలను సెలెక్ట్ చేసుకుంటారో చూడాలి.