Begin typing your search above and press return to search.

మెగా కాంబినేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా?

మెగా ఫ్యామిలీ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది మొదటిగా మెగాస్టార్ చిరంజీవి. తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నెక్స్ట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.

By:  Tupaki Desk   |   25 Nov 2023 5:06 AM GMT
మెగా కాంబినేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా?
X

మెగా ఫ్యామిలీ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది మొదటిగా మెగాస్టార్ చిరంజీవి. తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నెక్స్ట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఈ ముగ్గురు హీరోల సినిమాలు వస్తున్నాయి అంటే మెగా అభిమానుల సందడి నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. దేశంలోనే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో మెగా త్రయం ముందు వరుసలో ఉంటుంది.

ఈ ముగ్గురు హీరోలు ఎవరికి వారు తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుని సక్సెస్ ఫుల్ హీరోలుగా దూసుకుపోతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో రామ్ చరణ్ టైం నడుస్తోంది. ఆర్ఆర్ఆర్ సక్సెస్ తరువాత చెర్రీ ఏకంగా గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. అయితే చిరంజీవి, పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని చూడాలని మెగా అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు.

మెగాస్టార్ శంకర్ దాదా జిందాబాద్ లో పవర్ స్టార్ గెస్ట్ అపీరియన్స్ ఇచ్చారు. అయితే ఆ మూవీ సక్సెస్ కాలేదు. రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఆచార్య మూవీ గత ఏడాది రిలీజ్ అయింది. ఈ చిత్రం వారి కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఫ్యాన్స్ అంచనాలను ఏమాత్రం ఈ చిత్రాలు అందుకోలేకపోయాయి.

అయిన కానీ మరలా మెగా కాంబినేషన్ లో ఒక బ్లాక్ బస్టర్ సినిమా చూడాలని ఆశ పడుతూనే ఉన్నారు. తాజాగా ఎక్స్ లో ఓ మెగా అభిమాని మెగాస్టార్, మెగా పవర్ స్టార్ కాంబినేషన్ లో మీ దర్శకత్వంలో సినిమా చూడొచ్చా అని హరీష్ శంకర్ కి ట్యాగ్ చేసి అడిగాడు. దీనికి హరీష్ శంకర్ కూడా ఇంట్రెస్టింగ్ గా సమాధానం చెప్పడం విశేషం. ఈ కాంబినేషన్ కి పవర్ స్టార్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు అంటూ ఆ అభిమానికి హరీష్ శంకర్ రిప్లై ఇచ్చారు.

దీనిపై మెగా అభిమానులు ఆసక్తికరంగా రియాక్ట్ అవుతున్నారు. మెగా త్రయంతో సినిమా చేస్తే కచ్చితంగా మీ గుడి కట్టిస్తా అంటూ ఓ అభిమాని కామెంట్ చేశారు. మరికొందరు ఈ కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నాం అంటూ ట్వీట్స్ పెట్టారు. దీనిని బట్టి మెగా కాంబినేషన్ లో ఒక బ్లాక్ బస్టర్ మూవీని చూడటానికి ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో అనేది అర్థమవుతుంది.