Begin typing your search above and press return to search.

మెగా ఫ్యాన్స్ కి చిరాకు తెప్పిస్తున్న ఇండియన్‌..!

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ 2 సినిమా విడుదల కోసం ఫ్యాన్స్‌ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

By:  Tupaki Desk   |   15 May 2024 9:14 AM GMT
మెగా ఫ్యాన్స్ కి చిరాకు తెప్పిస్తున్న ఇండియన్‌..!
X

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ 2 సినిమా విడుదల కోసం ఫ్యాన్స్‌ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చాలా ఏళ్ల క్రితం ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. కొన్ని కారణాల వల్ల సినిమా చాలా ఆలస్యం అయ్యింది.

మధ్యలో ఈ సినిమా పూర్తిగా ఆగిపోయింది.. దర్శకుడు శంకర్‌ ఇండియన్ 2 ప్రాజెక్ట్‌ ను వదిలేసి రామ్‌ చరణ్ తో గేమ్‌ చేంజర్‌ ను మొదలు పెట్టాడని అంతా అనుకున్నారు. కానీ రామ్‌ చరణ్ తో గేమ్‌ చేంజర్ సినిమాను చేస్తున్న సమయంలోనే దర్శకుడు శంకర్‌ మళ్లీ ఇండియన్ 2 సినిమాను పునః ప్రారంభించాడు.

ఇప్పటికే పూర్తి అవ్వాల్సిన గేమ్‌ చేంజర్ ను ఇప్పటి వరకు కూడా పూర్తి చేయలేదు. అందుకు కారణం ఇండియన్ 2 అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియన్‌ 2 సినిమా విడుదల అయిన తర్వాతే గేమ్‌ చేంజర్ సినిమా విడుదల విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మొన్నటి వరకు జూన్‌ 13న ఇండియన్ 2 ను విడుదల చేస్తామంటూ యూనిట్‌ సభ్యులు ప్రచారం చేశారు. కానీ ఎన్నికల హడావుడి మరియు పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ పూర్తి అవ్వక పోవడంతో ఇండియన్‌ 2 ను జులై 12 కు వాయిదా వేశారు. కొత్త విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్ పై ఫ్యాన్స్‌ నమ్మకం వ్యక్తం చేయడం లేదు.

జులై 12న సినిమా విడుదల చేస్తామని లైకా ప్రొడక్షన్స్ వారు ప్రకటించినా కూడా ఆ తేదీకి అయినా వస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పదే పదే విడుదల తేదీలను మార్చుతున్న ఇండియన్ 2 మేకర్స్ పై మెగా ఫ్యాన్స్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇండియన్ 2 సినిమా విడుదల అయితే తప్ప దర్శకుడు శంకర్‌ గేమ్‌ చేంజర్ ని పూర్తి చేసే పరిస్థితి లేదు. అందుకే ఎప్పుడెప్పుడు ఇండియన్ 2 వస్తుందా అంటూ మెగా ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు. ఇండియన్‌ 2 ఈసారి అయినా చెప్పిన టైం కి రావాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

గేమ్‌ చేంజర్‌ ను ఇదే ఏడాదిలో విడుదల చేయాలంటే జులై లో అయినా ఇండియన్‌ 2 విడుదల అవ్వాల్సిన అవసరం ఉందని సినీ వర్గాల వారు మరియు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గేమ్‌ చేంజర్‌ పై మెగా ఫ్యాన్స్ తో పాటు పాన్‌ ఇండియా ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి నెలకొంది. అంచనాలకు తగ్గట్లుగా దర్శకుడు శంకర్‌ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.