Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : మెగా డాటర్‌ స్టైలిష్‌ లుక్‌

పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన నిహారిక ఇటీవలే వెబ్‌ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది

By:  Tupaki Desk   |   25 Nov 2023 12:30 PM GMT
ఫోటోటాక్ : మెగా డాటర్‌ స్టైలిష్‌ లుక్‌
X

మెగా ఫ్యామిలీ నుంచి సినిమా ఇండస్ట్రీ లో నటిగా అడుగు పెట్టిన ఒకే ఒక్క అమ్మాయి నిహారిక అనే విషయం తెల్సిందే. మల్టీ ట్యాలెంటెడ్‌ అనిపించుకుంటూ తనకంటూ మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న నిహారిక హీరోయిన్ గా చేసిన సినిమాలు కొన్నే అయినా కూడా నటిగా మంచి పేరును సొంతం చేసుకుంది.


పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన నిహారిక ఇటీవలే వెబ్‌ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ వెబ్‌ సిరీస్ లో కూడా నటనతో మెప్పించింది. ఇదే జోష్‌ తో నిహారిక మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు అంటూ చాలా మంది మెగా ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ నిహారిక సినిమాలపై క్లారిటీ ఇవ్వడం లేదు.


మరో వైపు నిహారిక సోషల్‌ మీడియా ద్వారా తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూనే ఉంది. ఇటీవలే తన అన్న వరుణ్‌ పెళ్లి లో చేసిన సందడి తాలూకు ఫోటోలను షేర్ చేసిన నిహారిక తాజాగా ఒక స్టైలిష్ లుక్‌ ఫోటోను షేర్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. లైట్ కలర్‌ డ్రెస్ లో నిహారిక చాలా అందంగా క్యూట్‌ గా కనిపిస్తుందని నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

నిహారిక గట్టిగా ట్రై చేయాలే కానీ వరుస సినిమాలు చేయగలదు. కానీ నిహారిక తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని నటిగా బిజీ అవ్వాలని భావించడం లేదని తెలుస్తోంది. నటిగా మళ్లీ నిహారిక బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇలాంటి ఫోటో షూట్స్ ను చూస్తూ ఉంటే అనిపిస్తోందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిహారిక సినిమా ల్లో రీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకునే వారు చాలా మందే వున్నారు.