Begin typing your search above and press return to search.

మెగా క్రేజీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేది అప్పుడే..

బింబిసారతో కళ్యాణ్ రామ్ కి బంపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ వశిష్ట చిరు సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.

By:  Tupaki Desk   |   5 Sep 2023 2:37 PM GMT
మెగా క్రేజీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేది అప్పుడే..
X

మెగా స్టార్ చిరంజీవి ఇటీవల భోళా శంకర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో, ఈ సారి పక్కా హిట్టు కొట్టాలని చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగానే మూవీలను ఎంచుకుంటున్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా అప్ డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ మూవీని మొదలుపెట్టే సమయం వచ్చేసింది.

బింబిసారతో కళ్యాణ్ రామ్ కి బంపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ వశిష్ట చిరు సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా ని నవంబర్ నుంచి ప్రారంభించనున్నారట. మొదలు పెట్టిన దగ్గర నుంచి కంటిన్యూస్ గా రెగ్యూలర్ షూటింగ్ చేయాలని అనుకుంటన్నారట. ఈ సినిమాని యూవీ సంస్థ నిర్మించనుంది. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన ఓ కాన్సెప్ట్ పోస్టర్ ని విడుదల చేయగా, విపరీతంగా ఆకట్టుకుంది. కచ్చితంగా ఈ సినిమా డిఫరెంట్ గా ఉంటుందనే నమ్మకం ఫ్యాన్స్ లో కలిగింది.

ఇది చిరు 157వ సినిమా కాగా, ఈ మూవీలో చాలా స్పెషాలిటీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎవరూ చూడని విజువల్ ఎఫెక్ట్స్ ని ఈ సినిమాలో చూపించనున్నారు. అది ఈ సినిమాకి మరింత అదనపు ఆకర్షణగా నిలుస్తుందట. అంతేకాకుండా, ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ పార్ట్ ని షూట్ చేయడానికి చిరంజీవితో పాటు, టీమ్ అంతా విదేశాలకు వెళ్లనున్నట్లు వినికిడి. అంతేకాకుండా, ఈ మూవీలో కంప్యూటర్ గ్రాఫిక్స్ కోసం ఓ హాలీవుడ్ కంపెనీ పనిచేయనున్నట్లు తెలుస్తోంది.

అక్కడితో అయిపోలేదు. చిరంజీవి కూడా రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తాడనే ప్రచారం జరుగుతోంది. ఒకటి నార్మల్ గా ఉన్నా, మరో లుక్ మాత్రం పోస్తెటిక్ మేకప్ తో ఉంటుందట. ఇది చిరు మొట్ట మొదటి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం.మరి ఈ మూవీతో చిరు తన గ్రేస్ ని మరోసారి చూపించే అవకాశం ఉంది.

ఇక, ఈ మూవీ షూటింగ్ మొదలుపెట్టిన తర్వాత చిరు 156వ సినిమా అప్ డేట్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాని బంగార్రాజు ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి ఇంకా కథ ఫైనల్ కాలేదని సమాచారం. ఈ సినిమాతో చిరు కూతురు సుష్మిత నిర్మాతగా మారుతోంది.