Begin typing your search above and press return to search.

మెగా ఫ్యామిలీ భ‌విష్య‌త్ ఈ బాల‌లే!

మెగా- అల్లు ఫ్యామిలీల భ‌విష్య‌త్ ఈ బాల‌లే అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ కుటుంబం నుంచి ఇప్ప‌టికే ఎంతో మంది హీరోలున్నారు

By:  Tupaki Desk   |   15 Nov 2023 6:46 AM GMT
మెగా ఫ్యామిలీ భ‌విష్య‌త్ ఈ బాల‌లే!
X

మెగా- అల్లు ఫ్యామిలీల భ‌విష్య‌త్ ఈ బాల‌లే అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ కుటుంబం నుంచి ఇప్ప‌టికే ఎంతో మంది హీరోలున్నారు. చిరంజీవి త‌న‌యుడు...నాగ‌బాబు త‌న‌యుడు..మెగా మేన‌ల్లుళ్లు... అల్లు అర‌వింద్ త‌న‌యులు ఇలా పెద్ద జాబితానే ఉంది. చిరంజీవి- అల్లు అర‌వింద్ వేసిన పునాదిని ఆధారంగా చేసుకుని వాళ్లంతా ఇండ‌స్ట్రీ లో చ‌క్రం తిప్పుతున్నారు.

వీరంతా చిరంజీవి త‌ర్వాత త‌రం న‌టులుగా వ‌స్తారు. త‌న‌యులు..త‌న‌య‌రాళ్ల త‌ర్వాత త‌రం ఎవ‌రంటే? ఈ బాల‌ల ఫోటోనే చూపించాలి. అవును తాజాగా నిన్న‌టి రోజున చిల్డ్ర‌న్స్ డే ని పుర‌స్క‌రించుకుని మెగా డాట‌ర్ శ్రీజ మెగా ఫ్యామిలీ బాల‌లంద‌ర్నీ ఒకే ప్రేమ్ లో బంధించిన ఫోటోని అభిమానుల‌తో పంచుకు న్నారు. అందులో చిరంజీవి మ‌న‌వ‌డు..మ‌న‌వ‌రాళ్లు..అల్లు అర‌వింద్ మ‌న‌వ‌డు..మ‌న‌వ‌రాళ్లు ఇంకా మ‌రికొంత మంది బాలలున్నారు.

చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత పిల్లలు.. చిన్న కూతురు పిల్లలు.. అల్లు అర్జున్ పిల్లలు మ‌రికొంత మంది బాల‌లు క‌నిపిస్తున్నారు. వీరంతా భ‌విష్య‌త్ తార‌లు అన‌డంలో సందేహం లేదు. పెద్ద‌య్యాక వీళ్ల‌లో చాలా మంది మ్యాక‌ప్ వేసుకోవ‌డానికి అవ‌కాశం ఎక్కువ‌గా ఉంది. అందులో ఎంట్రీ ఇవ్వ‌డానికి కొంత మంది ఐదారు సంవ‌త్స‌రాలు ప‌ట్టిన వారు కొంత మందైతే..ప‌ది..ప‌దిహేన‌ళ్ల‌కు తెరంగేట్రం చేసే వ‌య‌సు వ‌చ్చే బాల‌లు మరికొంత మంది ఉన్నారు.

చిన్న నాటి నుంచి సినిమా వాతావ‌ర‌ణంలో పెరిగిన బాల‌లే కాబ‌ట్టి జీన్స్ ఎలాగూ వ‌చ్చేస్తాయి. అప్ప‌టికి ఇండ‌స్ట్రీ మ‌రింత డెవ‌లెప్ అవుతుంది. థియేట‌ర్ లో సినిమా పోయి ఓటీటీ అప్ డెటెడ్ వెర్ష‌న్స్ కూడా వ‌చ్చేస్తాయి. అయితే ఈ అంద‌మైన పిక్ లో చ‌ర‌ణ్‌-ఉపాసానల ముద్దుల కుమార్తె క్లీంకార మాత్రం మిస్ అయింది. క్లీంకార ఇంకా నెల‌లు పాపే కావ‌డంతో త‌ల్లిదండ్రులు బేబికి ఆ ఛాన్స్ ఇవ్వ‌లేదు.