Begin typing your search above and press return to search.

చిన్న కోడ‌లు స్వీట్ అయితే పెద్ద కోడ‌లు సూప‌ర్ స్వీట్!

ఇక ఉపాస‌న‌కి తోటి కోడ‌లిగా ఇటీవ‌లే ఆ కుటుంబంలోకి లావ‌ణ్య త్రిపాఠి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 Jan 2024 6:53 AM GMT
చిన్న కోడ‌లు స్వీట్ అయితే పెద్ద కోడ‌లు సూప‌ర్ స్వీట్!
X

మెగా ఇంట సంక్రాంతి సంబురాలు మొద‌లైన సంగ‌తి తెలిసిందే. మెగా-అల్లు కుటుంబాలు రెండు బెంగుళూరులోని ఫామ్ హౌస్ కి చేరుకున్న సంగ‌తి తెలిసిందే. భోగి పండుగ‌తో ఆ కుటుంబాల్లో సంక్రాంతి మొద‌లైపోయింది. ఇంటిని ఎంతో అందంగా డెకరేట్ చేసారు. విందు భోజ‌నాలు..స్నాక్స్.. కాపీ టైమ్.. మెహందీ..యోగా టైమ్ అంటూ అన్ని టైమింగ్ ప్ర‌కారం మెగా ఇంట పెద్ద కోడ‌లు ఉపాస‌న అంతా ప‌ర్పెక్ట్ గా ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది.


దానికి సంబంధించిన విష‌యాల్ని ఇన్ స్టాలో షేర్ చేసారు. ఇక ఉపాస‌న‌కి తోటి కోడ‌లిగా ఇటీవ‌లే ఆ కుటుంబంలోకి లావ‌ణ్య త్రిపాఠి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. తోటి కోడ‌ల్ని ఉద్దేశించి ఓ ఆస‌క్తిక‌ర పోస్ట్ షేర్ చేసారు ఉపాస‌న‌. `కొత్త కోడ‌లు ఇంటిల్ల‌పాదికి సున్నండ‌లు చేస్తోంది. ఆమె ఎంతో స్వీట్ ` అని రాసుకొచ్చారు. అందుకు చిన్న కోడులు లావ‌ణ్య కూడా అంతే చ‌మ‌త్క‌రించారు. `థాంక్యూ. సూప‌ర్ స్వీట్ పెద్ద కోడలు` అంటూ రిప్లై ఇచ్చారు.

మొత్తానికి చిన్న కోడలు-పెద్ద కోడ‌లు క‌లిసి తొలిసారి జ‌రుపుకుంటోన్న సంక్రాంతి ఇదే. అల్లు-మెగా కుటుంబాలు ప్ర‌తీ ఏడాది సంక్రాంతిని బెంగుళూరులోని చిరు ఫామ్ హౌస్ లోనే ఎంతో ఘ‌నంగా జ‌రుపుకుంటారు. ఆ వేడుక‌లో ఎవ్వ‌రూ మిస్ కారు. అంతా త‌ప్ప‌కుండా పాల్గొంటారు. మూడు రోజుల పాటు ఆ రెండు కుటుంబాలు ఎంతో సంతోషంగా గ‌డుపుతాయి. చ‌ర‌ణ్ ని పెళ్లాడిన త‌ర్వాత ఉపాస‌న కూడా భాగ‌మ‌య్యారు.

ఇటీవ‌లే వ‌రుణ్ తేజ్ ని పెళ్లాడిన త‌ర్వాత‌ లావ‌ణ్య త్రిపాఠి మెగా ఇంట కోడ‌లైంది. దీంతో తొలి సంక్రాంతిని ఆ రెండు కుటుంబాల‌తో క‌లిసి జ‌రుపుకుంటుంది. ఈ సంద‌ర్భంగా తోటి కోడ‌ళ్లు ఇద్ద‌రి మ‌ధ్య‌న జ‌రిగిన సంభాష‌ణ ప్రేక్ష‌కాభిమానుల్ని ఆక‌ట్టుకుంటుంది. చిన్న కోడ‌లు-పెద్ద కోడ‌లు ఒక‌ర్ని ఒక‌రు పొగిడేసుకోవ‌డం విశేషం.