Begin typing your search above and press return to search.

ఐదు రోజుల గ్యాప్ తో మెగా బ్రదర్స్..?

మెగా బ్రదర్స్ ఇద్దరు బాక్సాఫీస్ ఫైట్ కు సిద్ధమవుతున్నారా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

By:  Tupaki Desk   |   17 Feb 2024 2:30 PM GMT
ఐదు రోజుల గ్యాప్ తో మెగా బ్రదర్స్..?
X

మెగా బ్రదర్స్ ఇద్దరు బాక్సాఫీస్ ఫైట్ కు సిద్ధమవుతున్నారా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. మెగాస్టార్ చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో తెరకక్కుతున్న విశ్వంభర 2025 సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశారు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా జనవరి 10న రిలీజ్ ఫిక్స్ చేశారట.

మరోపక్క ఈసారి సంక్రాంతికి పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమా కూడా రిలీజ్ అవుతుందని టాక్. క్రిష్ డైరెక్షన్ లో నాలుగేళ్లుగా సెట్స్ మీద ఉంటున్న ఈ సినిమా ఇంకా కొంత పార్ట్ షూట్ చేయాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు ఆ పోర్షన్ కంప్లీట్ చేసి మూవీని రిలీజ్ చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు.

శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ లో ఏ.ఎం. రత్నం నిర్మిస్తున్న వీరమల్లు సినిమా కూడా భారీ బడ్జెట్ మూవీగా వస్తుంది. పీరియాడికల్ కథతో వస్తున్న ఈ సినిమాలో పవన్ లుక్, స్టైల్ అన్నీ కూడా కొత్తగా ఉంటాయని తెలుస్తుంది. పవన్ డేట్స్ ఇవ్వడమే ఆలస్యం సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మేకర్స్ అనుకుంటున్నారు.

చిరంజీవితో పవన్ కళ్యాణ్ ఫైట్ ఇది నిజంగానే రసవత్తరంగా ఉంటుంది. ఇదివరకు ఎప్పుడు ఇలా సినిమాలతో ఈ మెగా బ్రదర్స్ పోటీ పడలేదు. తమ్ముడు సినిమాకు అన్న.. అన్న సినిమాకు తమ్ముడు ఎప్పుడు పోటీ లేకుండా చూసుకున్నారు. కానీ ఈ పొంగల్ కి ఫైట్ తప్పేలా లేదు. అయితే ఎలాగు సంక్రాంతికి రిలీజ్ కన్ఫర్మ్ అయితే మాత్రం చిరు పవన్ మధ్య మాక్సిమం రోజులు గ్యాప్ ఉండేలా చూస్తున్నారు. అలా చూస్తే జనవరి 10న చిరు విశ్వంభర వస్తే పవన్ హరి హర వీర మల్లు జనవరి 15 లేదా 16న వస్తుందని అంటున్నారు. రెండు సినిమాల మధ్య ఐదు రోజులు గ్యాప్ ఉంది కాబట్టి అంతగా ఎఫెక్ట్ పడే ఛాన్స్ తక్కువే అని చెప్పొచ్చు. విశ్వంభర సినిమా గ్రాండ్ విజువల్ తో భారీ అంచనాల మధ్య వస్తుంది. వీరమల్లు సినిమా ఆగి ఆగి షూటింగ్ జరుపుకుంటుంది. వీటితో పాటుగా ప్రభాస్ రాజా సాబ్ కూడా నెక్స్ట్ పొంగల్ ఫైట్ కి రెడీ అవుతున్నాడు.