Begin typing your search above and press return to search.

మెగా 157.. చిరు ప్లాన్ ఏంటి..?

ఇక ఈ సినిమా తర్వాత మెగా 157 వ సినిమా ఏమై ఉంటుందని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు.

By:  Tupaki Desk   |   25 Jan 2024 4:30 AM GMT
మెగా 157.. చిరు ప్లాన్ ఏంటి..?
X

మెగా 156 వ సినిమా వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. విశ్వంభర అంటూ మెగాస్టార్ చిరంజీవి చాలా రోజుల తర్వాత ఒక భారీ సినిమాకు శ్రీకారం చుట్టారు. బింబిసార తర్వాత వశిష్ట చేస్తున్న ఈ విజువల్ వండర్ సినిమాపై మెగా ఫ్యాన్స్ అంతా కూడా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఇక ఈ సినిమా తర్వాత మెగా 157 వ సినిమా ఏమై ఉంటుందని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. అసలైతే మెగా 156 సినిమాగా కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో చేయాలని అనుకున్నారు. కానీ ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు.

మెగా 156 కళ్యాణ్ కృష్ణ సినిమా ప్లేస్ లో విశ్వంభర వచ్చింది. మరోపక్క యువ దర్శకుడు వెంకీ కుడుముల తో కూడా చిరు సినిమా చేయాలని అనుకున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా ఓకే కానీ సెకండ్ హాఫ్ విషయంలో చిరంజీవి అసంతృప్తిగా ఉండటం వల్ల ఆ సినిమా కూడా పట్టాలెక్కలేదు. చిరు సినిమా చేతిదాకా వచ్చి జస్ట్ మిస్ అయ్యిందని వెంకీ కుడుముల చాలా అప్సెట్ అయ్యాడు.

ఇక ఒరిజినల్ కథలను పక్కన పెట్టి రీమేక్ లకు ఓటేసిన చిరుకి ఆ సినిమా ఫలితాలు పెద్ద షాక్ ఇచ్చయి. అందుకే ఇక మీదట వాటి జోలికి వెళ్లకూడదని ఫిక్స్ అయ్యాడు మెగాస్టార్. రీమేక్ లతో పని అవ్వదని డిసైడ్ అయిన చిరు యువ దర్శకులతో పని చేయాలని అనుకుంటున్నారు. అయితే ఇదే క్రమంలో మెగాస్టార్ తో సినిమా చేయాలని పూరీ జగన్నాథ్ ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాడు. అప్పట్లో పూరీ కథకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు రాగా ఆ కథలో కూడా సెకండ్ తో చిరు సాటిస్ఫై అవ్వలేదని అది పక్కన పెట్టారు.

150 సినిమాల అనుభవం ఉన్న చిరుకి కథలు సెలెక్ట్ చేసుకోవడం తెలియదా అనే విమర్శలు వచ్చాయి. కానీ వాటన్నిటికీ రాబోయే సినిమాలతో సమాధానం ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు చిరు. మెగాస్టార్ తో సినిమా చేయాలని చాలామంది దర్శకులకు ఉన్నా సరైన కథతో వస్తేనే ఛాన్స్ అంటున్నాడు చిరు. మరి మెగా 157 రేసులో చాలామంది ఉన్నట్టు అనిపిస్తున్నా ఎవరు ఫైనల్ అవుతారన్నది త్వరలో తెలుస్తుంది. మెగా విశ్వంభర సినిమా మాత్రం పర్ఫెక్ట్ ప్లానింగ్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను 2025 సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశారు. ఈ సినిమాను యువి క్రియేషన్స్ నిర్మిస్తుండగా సినిమాలో అనుష్క హీరోయిన్ గా నటిస్తుంది.