Begin typing your search above and press return to search.

157 మిస్ట‌రీ వీడెదెప్పుడు?

157 మిస్ట‌రీ వీడెదెప్పుడు? ఆ సినిమా ప‌ట్టాలెక్కెదెప్పుడు? అన్న‌దిప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. 156..157 చిత్రాల్ని మెగాస్టార్ చిరంజీవి ఒకేసారి ప్ర‌క‌టించి స‌ర్ ప్రైజ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   26 Nov 2023 11:30 AM GMT
157  మిస్ట‌రీ వీడెదెప్పుడు?
X

157 మిస్ట‌రీ వీడెదెప్పుడు? ఆ సినిమా ప‌ట్టాలెక్కెదెప్పుడు? అన్న‌దిప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. 156..157 చిత్రాల్ని మెగాస్టార్ చిరంజీవి ఒకేసారి ప్ర‌క‌టించి స‌ర్ ప్రైజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. కానీ 157వ సినిమా విష‌యంలో నీలి నీడ‌లు క‌మ్ముకుంటున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఆసినిమాకి ద‌ర్శ‌కుడు ఎవ‌రు? అన్న‌ది ఇంత‌వ ర‌కూ క్లారిటీ లేదు. క‌ళ్యాణ్ కృష్ణ పేరు వినిపించినా? ఆయ‌న ప్రాజెక్ట్ లో ఉన్నారా? లేరా? అన్న‌ది అర్దం కాని స‌న్నివేశంగా క‌నిపిస్తుంది.

ఇటీవ‌ల ఆ చిత్ర నిర్మాత‌నే ద‌ర్శ‌కురాలిగానూ మారుతుంద‌ని ప్ర‌చారం సాగుతుంది. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల తండ్రి సినిమాతో ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌యం అవుతున్న‌ట్లు జాతీయ మీడియాలో సైతం క‌థ‌నాలు వెలువడుతున్నాయి. తొలుత క‌ళ్యాణ్ కృష్ణ పేరు వినిపించినా చివ‌రి నిమిషంలో ఆయ‌న పేరు పోస్ట‌ర్ పై ప్ర‌క‌ట‌న రాక‌పోయేస‌రికి కొత్త సందేహాలకు తావిచ్చిన‌ట్లు అయింది. ఈ నేప‌థ్యంలో సుస్మిత పేరు ద‌ర్శ‌కురిలాగా తెర‌పైకి రావ‌డం ఆస‌క్తి సంత‌రించుకుంటుంది.

ఇంత‌వ‌ర‌కూ కాస్ట్యూమ్ డిజైన‌ర్ గా రాణించిన సుస్మిత తండ్రి సినిమాతో కొత్త శాఖ‌కు బ‌దిలీ అయితే అంత‌కు మించిన సంతోషం ఉండ‌దు. కానీ అదంత వీజీ కాదు. అందులోనూ నేరుగా మెగాస్టార్ సినిమాతోనే ద‌ర్శ‌కురాలిగా అంటే అతి బాధ్య‌త అవుతుంది. ద‌ర్శ‌క‌త్వంలో ఎలాంటి అనుభ‌వం లేకుండా అంత పెద్ద స్టార్ ని డైరెక్ట్ చేయ‌డం అన్న‌ది క‌త్తిమీద సాములాంటిది. వెనుక చిరంజీవి స‌హ‌కారం ఉన్నా! క్రియేటివ్ గా ఆమె ఫ‌దిరి ఎంత‌? అన్న‌ది డిసైడ్ చేయ‌లేనిది.

వాస్త‌వానికి ఓ ప్లానింగ్ ప్ర‌కారం సుస్మిత పేరుని అధికారికంగా రివీల్ చేస్తే హైప్ వ‌చ్చేది. కానీ ద‌ర్శ‌కుడు స‌ర్దుబాటు కాని స‌మ‌యంలో సుస్మిత పేరు వినిపించ‌డం అన్న‌ది అర్దం కానిది. కానీ సుస్మిత స‌క్సెస్ అయితే గ‌నుక కెరీర్ కి తిరుగుండ‌దు. మెగా ఫ్యామిలీలోనే కావాల్సినంత మంది హీరోలున్నారు. తండ్రి..సోద‌ర‌డు..మేన‌త్త బిడ్డ‌లు.. అల్లు ఫ్యామిలీ హీరోలంతా సుస్మిత చేతుల్లో హీరోలే. కానీ వీట‌న్నింటికంటే ముందు 157 మిస్ట‌రీ అన్న‌ది వీడితే త‌ప్ప ఈ సందేహాల‌న్నింటిపై క్లారిటీ రాదు.