Begin typing your search above and press return to search.

మెగా 157.. సర్ ప్రైజ్ ఏమిటంటే?

ఛాన్స్ లు వచ్చినప్పుడల్లా సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   3 July 2025 10:00 PM IST
మెగా 157..  సర్ ప్రైజ్ ఏమిటంటే?
X

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మెగా 157 ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ నయనతార ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. నటి క్యాథరిన్ త్రెస్సా, చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లిరాజు ముఖ్యపాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు.

షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఆ సినిమాకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలు కాగా.. శరవేగంగా జరుగుతోంది. కానీ అనౌన్స్మెంట్ నుంచి సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అదే సమయంలో అనిల్ రావిపూడి కూడా ఫస్ట్ నుంచి ఫుల్ గా సందడి చేస్తున్నారు.

ఛాన్స్ లు వచ్చినప్పుడల్లా సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా టైటిల్ ను త్వరలో అనౌన్స్ చేయనున్నామని తెలిపారు. ఆగస్టు 22వ తేదీన చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా టైటిల్ ను టీజర్ ద్వారా ప్రకటించనున్నారని టాక్.

అదే సమయంలో మెగా 157లో 70 శాతం కామెడీ, 30 శాతం డ్రామా ప్లస్ ఎమోషన్ ఉంటుందని అనిల్ రావిపూడి తెలిపారు. గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు తరహా చిరు నటించిన బ్లాక్ బస్టర్ సినిమాల్లోని వింటేజ్ క్యారెక్టరైజేషన్ మెగా 157లో డిజైన్ చేశానని చెప్పి అంచనాలు పెంచారు రావిపూడి.

ఆ తర్వాత సినిమాలో చిరంజీవి, నయనతారల మధ్య భార్యాభర్తల బాండింగ్ కొత్తగా ఉంటుందని పరోక్షంగా తెలిపారు. అప్పుడే సీనియర్ హీరో వెంకటేష్ రోల్ కు సంబంధించిన వివరాలు మాత్రం రివీల్ చేయలేదు. హోస్ట్ క్లియర్ గా అడ్జగా.. తానేం చెప్పనని.. టైమ్ వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతుందని అనిల్ రావిపూడి తెలిపారు.

"వెంకటేష్ గారి గురించి ఇప్పుడు చెప్తే థంబ్ నెయిల్స్ పెట్టి ఏదో రాస్తారు. ఇప్పుడు స్పందించడం చాలా ఎర్లీ అవుతుంది. ఇప్పటికే ఏదోదో రాసేస్తున్నారు. వెంకీ గారు ఉండడం సర్ప్రైజ్. నేను చెప్పకపోయినా రాస్తారు. సరైన టైమ్ వచ్చినప్పుడు బ్లాస్ట్ ఎలా చేయాలో అలా చేస్తాం. అప్పటి వరకు వెయిట్ చేయండి" అని అన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.