Begin typing your search above and press return to search.

'మెగా మాస్ యూనివర్స్' అంటే అర్థం?

మముత్ #Mega156 షూట్ వైభవంగా ప్రారంభమవుతుంది. మెగా మాస్ బియాండ్ యూనివర్స్ కీలక షెడ్యూల్ చిత్రీకరణతో జరుగుతోంది.. అని వెల్ల‌డించారు.

By:  Tupaki Desk   |   23 Nov 2023 3:11 PM GMT
మెగా మాస్ యూనివర్స్ అంటే అర్థం?
X

మెగాస్టార్ చిరంజీవి చివరిసారిగా యాక్షన్ చిత్రం 'భోళా శంకర్'లో కనిపించారు. ఇది కెరీర్ 155వ సినిమా. చిరంజీవి తన 156వ వెంచర్ 'మెగా 156' అనే సూపర్ నేచురల్ యాక్షన్ చిత్రం షూటింగ్‌ను ప్రారంభించారు. బింబిసార ఫేం వ‌శిష్ఠ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఎంఎం కీరవాణి సంగీతం, ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

మెగా 157 - మెగా 158 అనే మరో రెండు సినిమాలు కూడా బ‌రిలో ఉన్నాయి. చిరంజీవి 45 ఏళ్ల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో అజేయ‌మైన స్టార్ డ‌మ్ ని ఆస్వాధించారు. ఇప్ప‌టికీ త‌న‌ అసమానమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకర్షిస్తూనే ఉన్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో మెగాస్టార్ తదుపరి సినిమా 'బింబిసార' ఫేం వశిష్టతో ఉంటుందని ప్ర‌క‌టించారు. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ గురించి నిర్మాణ బృందం కొన్ని శుభవార్తలను వెల్లడించింది. ఇటీవలి ప్రారంభోత్స‌వం గురించి వెల్ల‌డిస్తూ క్లాప్‌బోర్డ్ ఫోటో - శీర్షికతో పాటు సోషల్ మీడియాలో ప్రకటించింది. మముత్ #Mega156 షూట్ వైభవంగా ప్రారంభమవుతుంది. మెగా మాస్ బియాండ్ యూనివర్స్ కీలక షెడ్యూల్ చిత్రీకరణతో జరుగుతోంది.. అని వెల్ల‌డించారు. యూనివర్స్ దాటి మెగా మాస్ కోసం శక్తులు పెరుగుతాయి అంటూ కొత్త‌గా సూత్రీక‌రించారు.

అయితే అభిమానుల‌కు ఇప్పుడు ఒక క‌న్ఫ్యూజ‌న్ నెల‌కొంది. 'మెగా మాస్ యూనివ‌ర్శ్' అంటూ కొత్త ప‌దాన్ని వ‌శిష్ఠ లాంటి ప్ర‌తిభావంతుడితో క‌లయిక‌లో, సాయి మాధ‌వ్ బుర్రా లాంటి రైట‌ర్ నుంచి పుట్టుకొచ్చిన‌ట్టు అనిపిస్తోంది. అంటే చిరు ఇక వ‌రుస‌గా యూనివర్శ్ (విశ్వం) త‌ర‌హా సినిమాల్లో న‌టిస్తారా? ఒక‌టికి మించి సినిమాలు ఇదే సిరీస్ లో ఉంటాయా? అంటూ డౌట్లు పుట్టుకొచ్చాయి. బింబిసార వ‌శిష్ఠ ఏదైనా మెగా మాస్ యూనివ‌ర్శ్ ని క్రియేట్ చేస్తున్నారా? అన్న సందేహం నెల‌కొంది. ఇది అంజి త‌ర‌హాలో విజువ‌ల్ గ్రాఫిక్స్ ఆధారంగ రూపొందే సినిమా అని ప్ర‌చారం ఉంది. అతీంద్రియ శ‌క్తుల‌ను బేస్ చేసుకుని రాసుకున్న క‌థ‌తో తీస్తున్న సినిమానా? ఒక‌టి కంటే ఎక్కువ సినిమాలు ఈ ఫ్రాంఛైజీలో ఉంటాయా? అన్న డౌట్లు వ్య‌క్తం చేస్తున్నారు. అవెంజ‌ర్స్ సిరీస్ లా.. బ్ర‌హ్మాస్త్ర‌ ఫ్రాంఛైజీ లా.. మెగా బాస్ ఏదైనా ప్ర‌య‌త్నం చేస్తున్నారా? అంటే.. అట్నుంచి ఎలాంటి రిప్ల‌య్ ఉంటుందో వేచి చూడాలి.

మెగా 156 తో పాటు, చిరంజీవికి మెగా 157 -మెగా 158 అనే రెండు సినిమాలు చిత్రీక‌ర‌ణ‌కు వెళ్‌ల‌నున్నాయి. మెగా 157 కి సుష్మిత కొణిదెల దర్శకత్వం వహించనుండగా (అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది), మెగా 158 చిత్రానికి బోయపాటి శ్రీ‌ను దర్శకత్వం వహించనున్నారు.