Begin typing your search above and press return to search.

# 156 లో ఐదుగురు హీరోయిన్లా?

అనుష్క‌..న‌య‌న‌తార‌..త్రిష.మౄణాల్ ఠాకూర్ లాంటి పేర్లు వినిపించాయి. అయితే మెగాస్టార్ కి జోడీగా ఒక‌రు..కాదు..ఇద్ద‌రు కాదు. ఏకంగా ఐదుగురు హీరోయిన్లే స్టోరీ డిమాండ్ చేస్తున్న‌ట్లు ఓ వార్త ప్ర‌చారంలోకి వ‌చ్చింది.

By:  Tupaki Desk   |   1 Nov 2023 12:30 AM GMT
# 156 లో ఐదుగురు హీరోయిన్లా?
X

మెగాస్టార్ చిరంజీవి 156వ చిత్రం పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. 'బింబిసార' ఫేం మ‌ల్లిడి వ‌శిష్ట ఈ చిత్రాన్ని సోసియా ఫాంట‌సీ క‌థ‌తో తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర వేగంగా జ‌రుగుతున్నాయి. దీనిలో భాగంగా చిరంజీవికి జోడీగా ఏ హీరోయిన్ అయితే బాగుంది? అన్న ప్ర‌చార కొద్ది రోజులుగా జోరుగా సాగుతుంది. ఇప్ప‌టికే కొంత మంది సీనియ‌ర్ నాయిల‌క పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి.

అనుష్క‌..న‌య‌న‌తార‌..త్రిష.మౄణాల్ ఠాకూర్ లాంటి పేర్లు వినిపించాయి. అయితే మెగాస్టార్ కి జోడీగా ఒక‌రు..కాదు..ఇద్ద‌రు కాదు. ఏకంగా ఐదుగురు హీరోయిన్లే స్టోరీ డిమాండ్ చేస్తున్న‌ట్లు ఓ వార్త ప్ర‌చారంలోకి వ‌చ్చింది. మూడు లోకాలు చుట్టూ తిరిగే క‌థ అని అంటున్నారు. దేవ‌..మాన‌వ‌..పాతాళ లోకాల్లో ఓ పాప చుట్టూ తిరిగే ఇంట్రెస్టింగ్ క‌థ‌తో సినిమా సాగుతుంద‌ని వినిపిస్తుంది. ఈ నేప‌థ్యంలో తెర‌పైకి ఇంత మంది హీరోయిన్లు తీసుకొస్తున్న‌ట్లు తెలుస్తుంది.

అలాగే సినిమాలో ద‌గ్గుబాటి రానా విల‌న్ పాత్ర పోషిస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతుంది. దీంతో సినిమా భారీ కాన్సాప్ పైనే తెర‌కెక్కుతున్న‌ట్లు నెట్టింట ప్ర‌చారం షురూ అయింది. సినిమా సెట్స్ కి వెళ్ల‌క‌ముందే తారాగ‌ణం విష‌యంలో తెరంతా నిడిపోతుంది. సెట్స్ కి వెళ్లిన త‌ర్వాత ఇంకా చాలా ర‌కాల మార్పుల‌కు అవ‌కాశం ఉంటుంది. చిరంజీవి సైతం అవ‌స‌రంమేర కొన్ని ర‌కాల స‌ల‌హాలు ఇస్తుంటారు. అందుకు త‌గ్గ‌ట్టు ద‌ర్శ‌కుడు ప‌నిచేయాల్సి ఉంటుంది.

ఈ నేప‌థ్యంలో కొత్త ప్రాత‌లు యాడ్ అవ్వ‌డానికి అవ‌కాశం ఉంటుంది. అయితే ఐదుగురు హీరోయిన్ల నేప‌థ్యంలో ఎవ‌రెవ‌రిని ఎంపిక చేస్తారు? అన్న‌ది ఆస‌క్తిక‌రం. చిరు వ‌య‌సుకు త‌గ్గ హీరోయిన్ల‌ను ఎంపిక చేయ‌డం అంత సుల‌భం కాదు. 35 దాటిన హీరోయిన్ల‌లే ఆయ‌న‌కు జోడీగా ఎంపిక చేయాలి. అలాంటి భామ‌లు ఫాలో ఉన్న‌ది ఐదారుగురే. అలా కాకుండా వేరే ఛాయిస్ తీసుకోవాలంటే? కొత్త భామ‌ల్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈనేప‌థ్యంలో 156 లో హీరోయిన్ల టాపిక్ ఆస‌క్తిక‌ర‌మే.