Begin typing your search above and press return to search.

మెగా హీరోల్లో అత‌డు స్పెష‌ల్!

మెగా హీరోల్లో వ‌రుణ్ తేజ్ స్పెష‌ల్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. అత‌డు చేసిన‌న్ని ప్ర‌యోగాలు మ‌రో మెగా హీరో చేయ‌లేదు అన్న‌ది అంతే వాస్త‌వం.

By:  Tupaki Desk   |   25 April 2025 7:00 AM IST
Varun Tej’s Pan-India Experimentation
X

మెగా హీరోల్లో వ‌రుణ్ తేజ్ స్పెష‌ల్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. అత‌డు చేసిన‌న్ని ప్ర‌యోగాలు మ‌రో మెగా హీరో చేయ‌లేదు అన్న‌ది అంతే వాస్త‌వం. ఓ న‌టుడిగా అన్ని ర‌కాల జోన‌ర్ చిత్రాలు చేయ‌డం వ‌రుణ్ కే చెల్లింది. ముఖ్యంగా సాహ‌సాలు చేయ‌డంలో వ‌రుణ్ స్పెష‌లిస్ట్ అని కెరీర్ ఆరంభంలోనే నిరూపించుకున్నాడు. ఈ విష‌యంలో ఓ బ్ర‌ద‌ర్ గా రామ్ చ‌ర‌ణ్ కూడా అంతే గ‌ర్విస్తారు.

వ‌రుణ్ డిఫ‌రెంట్ జాన‌ర్ సినిమాలు చూసి త‌నకెంతో సంతోషం వేస్తుంద‌ని..అత‌డి డిఫ‌రెంట్ ఐడియాల‌జీ త‌న‌కు ఎంతో న‌చ్చుతుంద‌న్నారు చ‌ర‌ణ్‌. `కంచె`, `అంత‌రిక్షం`, `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌`, `గాండీవ‌ధారి అర్జున‌`, `ఆప‌రేష‌న్ వాలెంటైన్` ,` మట్కా` ఇవ‌న్నీ వ‌రుణ్ కెరీర్ లో ప్ర‌యోగాత్మ‌క చిత్రాలే. `కంచె`లో దేశ భ‌క్తితో పాటు అంద‌మైన ప్రేమ‌క‌థ‌లో క‌నిపించాడు. `అంత‌రిక్షం` లాంటి కాన్సెప్ట్ లు కేవ‌లం హాలీవుడ్, బాలీవుడ్ కే ప‌రిమమైన రోజుల్లో మ‌న‌కు అలాంటి సినిమా ఒక‌టి కావాల‌ని వ‌రుణ్ దైర్యం చేయ‌డంతో అది సాధ్య‌మైంది.

తాను అప్ప‌టికే స్టార్ గా ఫేమ‌స్ అయిన `గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్` లో వైవిథ్య‌మైన పాత్ర‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రించాడు. అటుపై `అంత‌రిక్షం` ఫెయిలైనా `ఆప‌రేషన్ వాలైంటైన్` లో వింగ్ క‌మాండర్ గా క‌నిపిం చాడు. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్ర‌మిది. అంత‌రిక్షం త‌ర్వాత వ‌రుణ్ కెరీర్ లో మ‌రో పెద్ద ప్ర‌యోగం ఇది. ఇలాంటి సినిమాలు అప్ప‌టి వ‌ర‌కూ టాలీవుడ్ లో ఏ న‌టుడు చేయ‌లేదు. క‌నీసం ఆలోచ‌న కూడా చేయలేదు.

కానీ వ‌రుణ్ మాత్రం వాటి కోసం నేను ఉన్నానంటే ఓ కొత్త ద‌ర్శ‌కుడి క‌థ‌ని న‌మ్మి చేసిన చిత్ర‌మే `ఆప‌రేష‌న్ వాలెంటైన్`. న‌టుడిగా వ‌రుణ్ స్థాయిని మార్చిన చిత్ర‌మిది. అటుపై `మ‌ట్కా` అంటూ మ‌రో ప్ర‌యోగం. ఈ సారి ఆ ప్రయోగం ఏకంగా పాన్ ఇండియాలోనే చేసాడు. జూదం అనే కాన్సెప్ట్ ని ఆధారంగా చేసుకుని తెర‌కెక్కించిన చిత్ర‌మిది. ఈ సినిమాలోనూ వ‌రుణ్ ఆహార్యం అంతా కొత్త అనుభూతిని పంచు తుంది. ఇలా మెగా హీరోల్లో ప్ర‌యోగాల‌కు పెట్టింది పేరు ఎవ‌రు? అంటే వ‌రుణ్ తేజ్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.