బుచ్చిబాబు ఉండగా చరణ్ ఫ్యాన్స్ కు టెన్షన్ ఎందుకు?
ఈ విషయంలో ఫ్యాన్స్ టెన్షన్ కు అర్థమున్నప్పటికీ పెద్ది టీజర్ వారి టెన్షన్ ను చాలా వరకు పోగొట్టింది. ఆ టీజర్ కు రెహమాన్ ఇచ్చిన బీజీఎం చాలా బావుంది.
By: Tupaki Desk | 6 Jun 2025 4:00 PM ISTకమల్ హాసన్ హీరోగా లెజండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన థగ్ లైఫ్ సినిమా రీసెంట్ గానే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా మీద రామ్ చరణ్ ఫ్యాన్స్ కు ముందు నుంచే కన్నుంది. దానిక కారణం థగ్ లైఫ్ సినిమాకీ, చరణ్ తర్వాతి సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఒకరే అవడం. ఆయన మరెవరో కాదు, ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్.
థగ్ లైఫ్ సినిమాకు రెహమాన్ మంచి మ్యూజిక్ ఇచ్చి ఉంటే చరణ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకునేవారు కానీ థగ్ లైఫ్ లో సాంగ్స్ తో పాటూ రీరికార్డిండ్ కూడా మరీ నీరసంగా ఉండటంతో ఇప్పుడు చరణ్ ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది. మణిరత్నం లాంటి డైరెక్టరే రెహమాన్ నుంచి బెస్ట్ మ్యూజిక్ తీసుకోలేకపోయినప్పుడు బుచ్చిబాబు ఎలాంటి ట్యూన్స్ తీసుకుంటాడోననే డౌట్ వారిలో ఎక్కువైంది.
ఈ విషయంలో ఫ్యాన్స్ టెన్షన్ కు అర్థమున్నప్పటికీ పెద్ది టీజర్ వారి టెన్షన్ ను చాలా వరకు పోగొట్టింది. ఆ టీజర్ కు రెహమాన్ ఇచ్చిన బీజీఎం చాలా బావుంది. రెహమాన్ వెంటపడి మరీ బుచ్చిబాబు ఈ ట్యూన్ ను ఫైనల్ చేశాడని, ఇదే తరహాలో పాటలు కూడా చేయించుకుంటే బావుంటుందని మెగా ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. అయితే బుచ్చిబాబు కూడా తన గురువు సుకుమార్ లాగానే ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వడు.
ఉప్పెన విషయంలో ఆల్రెడీ ఆ విషయం ప్రూవ్ అయింది. దేవీ శ్రీ ప్రసాద్ నుంచి చార్ట్ బస్టర్ ఆల్బమ్ ను రాబట్టుకున్నాడు బుచ్చిబాబు. అంతేకాదు, పెద్ది క్యాస్టింగ్ విషయంలో కూడా బుచ్చిబాబు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. తను కోరుకున్న వాళ్లను ఒప్పించి మరీ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడంటే బుచ్చిబాబు తన సినిమా విషయంలో ఎంత కసితో ఉంటాడో అర్థమయ్యేలా చేశాడు.
అసలే రెహమాన్ కు స్ట్రయిట్ తెలుగు బ్లాక్ బస్టర్ లేదనే నెగిటివ్ సెంటిమెంట్ ఉంది. దాన్ని మార్చాలంటే పెద్ది సినిమాకు నెక్ట్స్ లెవెల్ ఆల్బమ్ ఇవ్వాలి. ఇప్పటికే పెద్ది కోసం మూడు సాంగ్స్ రికార్డింగ్ ను పూర్తి చేయించుకున్న బుచ్చిబాబు, మిగిలిన సాంగ్స్ ను కూడా త్వరలోనే పూర్తి చేయించనున్నాడని తెలుస్తోంది. 2026 మార్చి 27న రిలీజ్ కాబోతున్న ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
