ఈ మే మామూలుది కాదు.. మెగా మే
మెగా ఫ్యాన్స్ కు ఈ సంవత్సరం మే చాలా ఎగ్జయింట్ నెలగా మారబోతుంది. దానికి కారణం ఒకటి కాదు, చాలానే ఉన్నాయి.
By: Tupaki Desk | 28 April 2025 3:00 AM ISTమెగా ఫ్యాన్స్ కు ఈ సంవత్సరం మే చాలా ఎగ్జయింట్ నెలగా మారబోతుంది. దానికి కారణం ఒకటి కాదు, చాలానే ఉన్నాయి. అందులో మొదటిది చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ ఐకానిక్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి మే 9న రీరిలీజ్ కానుండటం. ఎంతోకాలంగా ఈ సినిమా రీరిలీజ్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తుండగా, మే 9న ఈ సినిమా 35 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మేకర్స్ రీరిలీజ్ ప్లాన్ చేశారు.
మే 9వ తేదీన ఈ సినిమా టూడీ, త్రీడీ ఫార్మాట్ వెర్షన్లలో రిలీజ్ కానుంది. ఈ విషయం చిరూ ఫ్యాన్స్ తో పాటూ 90స్ కాలం నాటి వారందరికీ ఎంతో స్పెషల్. కాకపోతే మెగాఫ్యాన్స్ కు ఆ సంతోషం ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. దీంతో పాటూ అదే రోజు లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహం కూడా ఓపెన్ కానుంది.
ఈ కార్యక్రమానికి చరణ్ తన ఫ్యామిలీతో కలిసి హాజరు కానున్నాడు. మెగా ఫ్యాన్స్ కు ఇది చాలా మెమరబుల్ మూమెంట్ అని చెప్పొచ్చు. తమ అభిమాన హీరో విగ్రహం మేడమ్ టుస్సాడ్స్ లో పెట్టడమనేది చిన్న విషయం కాదు కాబట్టి చరణ్ ఫ్యాన్స్ ఈ విషయాన్ని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయనున్నారు. అంతేకాదు మరో అంశం కూడా ఉంది.
రాయల్ ఆల్బర్ట్ హాల్ లో జరిగే ఆర్ఆర్ఆర్ లైవ్ ఆర్కెస్ట్రా పెర్ఫార్మెన్స్ కు కూడా చరణ్ హాజరు కాబోతున్నాడు. ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు షూటింగ్ ను మే లోనే పూర్తి చేసి డబ్బింగ్ ను కూడా చెప్పడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దాంతో పాటూ మే నెలలోనే ఓజి సినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టాలని చూస్తున్నాడట పవన్.
పవన్ ఫ్యాన్స్ ఎప్పట్నుంచో వెయిట్ చేస్తున్న ఓజి సినిమా కోసం వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఓజి సినిమాకు సంబంధించిన వాళ్లు ఎవరు బయట కనిపించినా సినిమా గురించి అప్డేట్ అడుగుతూ హంగామా చేస్తున్నారు. మొత్తానికి ఈ 2025 మే చిరంజీవి సినిమా రీరిలీజ్, రామ్ చరణ్ మైనపు విగ్రహ ఆవిష్కరణ, పవన్ కళ్యాణ్ షూటింగులతో మెగా ఫ్యాన్స్ కు స్పెషల్ గా మారనుంది.
