ఇష్టంగా అలసిపోయిన నిహారిక
తాజాగా నిహారిక జిమ్‌లో తీసుకున్న రెండు ఫొటోలు వైరల్‌గా మారాయి. ఒక ఫొటోలో ఆమె జిమ్ ఫ్లోర్ మీద అలసిపోయినట్లు పడుకున్న విధానం కనిపిస్తుంది.
By: Tupaki Desk | 8 Jun 2025 2:00 PM ISTమెగా డాటర్ నిహారిక కొనిదెల ఒకప్పుడు వెబ్ సిరీస్, సినిమాల్లో నటిస్తూ అభిమానులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ‘ఒక మనసు’తో నటిగా మారిన నిహారిక ఆ తర్వాత ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సైరా నరసింహారెడ్డి’ వంటి చిత్రాల్లో నటించారు. ఇటీవల పెద్దగా సినిమాల్లో కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం తన యాక్టివ్ లైఫ్‌స్టైల్‌తో నిహారిక బాగా ట్రెండ్ అవుతోంది.
తాజాగా నిహారిక జిమ్‌లో తీసుకున్న రెండు ఫొటోలు వైరల్‌గా మారాయి. ఒక ఫొటోలో ఆమె జిమ్ ఫ్లోర్ మీద అలసిపోయినట్లు పడుకున్న విధానం కనిపిస్తుంది. మరొక ఫొటోలో మాత్రం చిరునవ్వుతో కూర్చున్న స్టైల్ ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలకు ఆమె ఇచ్చిన క్యాప్షన్.. నా కోసం బాధనివ్వగల ప్రియమైన ప్రదేశం ఇది… అంటూ నిహారికలోని డెడికేషన్‌ను తెలియజేస్తోంది.
ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ఆమె డెడికేషన్‌ను అభినందిస్తున్నారు. “మెగా ఫ్యామిలీలో నిహారిక లాగా ఫిట్‌నెస్‌పై ఇంతగా కష్టపడే వారెవ్వరు ఉండరేమో” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొన్ని రోజులు క్రితం వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి, కొన్ని ప్రయోగాలు చేసిన నిహారిక.. ఇప్పుడు మళ్లీ తాను మానసికంగా, శారీరకంగా బలంగా తయారవుతోందని ఈ ఫోటోల ద్వారా చెప్పకనే చెబుతోంది.
నిహారిక నటిగా మళ్లీ సెట్ అవుతుందా? అన్న ప్రశ్నపై కూడా అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఇటీవల ఓ వెబ్‌సిరీస్‌కు సంబంధించిన చర్చలు నడుస్తున్నాయని టాక్. మరి ఫిట్‌నెస్ జర్నీ తర్వాత ఆమె తిరిగి గ్లామర్ ఫీల్డ్‌లో అడుగుపెడుతుందా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆమె శ్రద్ధ అంతా ఆరోగ్యంపై ఉంది అన్నది స్పష్టంగా తెలుస్తోందఅం మొత్తానికి నిహారిక తన కొత్త జిమ్ అవతారంతో మరోసారి చర్చలోకి వచ్చింది.
