Begin typing your search above and press return to search.

మెగా అన్నదమ్ములు కలిసి ఎప్పుడు చేస్తారో..?

ఐతే ఇద్దరు కలిసి చేస్తే సరిపోదు దానికి తగిన కథ ఉండాలి. ఆ స్టోరీ కుదిరితే మాత్రం ఇక మిగతా అంతా అలా జరిగిపోతుంది.

By:  Tupaki Desk   |   15 Jun 2025 5:00 AM IST
మెగా అన్నదమ్ములు కలిసి ఎప్పుడు చేస్తారో..?
X

మెగా మేనల్లుళ్లు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇద్దరు కూడా ప్రస్తుతం ఒక సూపర్ హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. సాయి తేజ్ సంబరాల యేటిగట్టు సినిమా చేస్తున్నాడు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు బాగున్నాయి. తేజ్ లోని మాస్ యాంగిల్ ని ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ లో చూడబోతున్నారంటూ మేకర్స్ చెబుతున్నారు. ఆ సినిమా పూర్తై రిలీజ్ తర్వాతే తేజ్ నెక్స్ట్ సినిమా ఏంటన్నది తెలుస్తుంది.

మరోపక్క వైష్ణవ్ తేజ్ ఆదికేశవ్ తర్వాత హిట్ సినిమా సబ్జెక్ట్ కోసం వేట కొనసాగిస్తున్నాడు. ఉప్పెనతో తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న హీరోగా క్రేజ్ తెచ్చుకున్న వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడంతో కెరీర్ లో ఢీలా పడ్డాడు. ఆదికేశవ్ మీద కాస్త కూస్తో అంచనాలు ఉన్నాయి. అదీగాక ఆ సినిమా నిర్మించిన బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్ కాబట్టి ఆ బ్యానర్ కి మంచి క్రేజ్ ఉండటం వల్ల సినిమా వర్క్ అవుట్ అవుతుందని అనుకున్నారు. కానీ వైష్ణవ్ తేజ్ సినిమా రిజల్ట్ సేం అనేలా మరో ఫ్లాప్ పడింది.

ఈ క్రమంలో మెగా ఫ్యాన్స్ మెగా మేనల్లుళ్లు అదే అన్నదమ్ములు ఇద్దరు కలిసి సినిమా చేస్తే బాగుందని అంటున్నారు. సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ కలిసి ఒక మల్టీస్టారర్ సినిమా చేస్తే మెగా ఫ్యాన్స్ కి సూపర్ ఎగ్జైటెడ్ గా ఉంటుంది. అంతేకాదు ఆ సినిమాలో కుదిరితే వరుణ్ తేజ్ క్యామియో రోల్ కూడా పెడితే అబ్బో ఇక ఫ్యాన్స్ కి మరింత పండగే అని చెప్పొచ్చు. రకరకాల కాంబినేషన్స్ సెట్ అవుతున్న ఈ టైం లో ఒకే ఇంట్లో ఉన్న ఇద్దరు హీరోలు అదే అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఒక సినిమా చేస్తే సూపర్ గా వర్క్ అవుట్ అవుతుందని అంటున్నారు.

ఐతే ఇద్దరు కలిసి చేస్తే సరిపోదు దానికి తగిన కథ ఉండాలి. ఆ స్టోరీ కుదిరితే మాత్రం ఇక మిగతా అంతా అలా జరిగిపోతుంది. మెగా ఫ్యాన్స్ విష్ బాగుంది కానీ ఈ మెగా అన్నదమ్ములు ఇద్దరు కలిసి నటించే ఛాన్స్ ఇప్పుడప్పుడే ఉంటుందా అన్న డౌట్ రాకమానదు. తేజ్, వైష్ణవ్ ఇద్దరు ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు. వైష్ణవ్ నెక్స్ట్ సినిమా తో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని చాలా కసి మీద ఉన్నాడు. మరి అతను మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చాక గానీ ఈ మల్టీస్టారర్ కథ ఏంటన్న విషయం తెలుస్తుంది.