Begin typing your search above and press return to search.

రియాల్టీకి దూరంగా ఉన్న సీక్వెల్‌ మూవీకి నిరాశ

మొత్తానికి మెగ్ 2 సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది

By:  Tupaki Desk   |   8 Aug 2023 3:56 AM GMT
రియాల్టీకి దూరంగా ఉన్న సీక్వెల్‌ మూవీకి నిరాశ
X

ఇండియన్ సినీ ప్రేక్షకులు హాలీవుడ్‌ సినిమాలంటే తెగ అభిమానం చూపిస్తారు అనడంలో సందేహం లేదు. గతంలో పలు సందర్భాల్లో ఆ విషయం నిరూపితం అయింది. ఇండియన్‌ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద ఉన్న సమయంలో కూడా హాలీవుడ్‌ సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకుని భారీ వసూళ్లు నమోదు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

ఇంగ్లీష్ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లు నమోదు చేసిన దాఖలాలు చాలానే ఉన్నాయి. గత నెలలో కూడా ఓపెన్‌ హెయిమర్‌, బార్బీ సినిమాలు భారీ వసూళ్లు సాధించాయి. రెండు సినిమాలు దాదాపుగా రెండు వందల కోట్ల వసూళ్లు సాధించినట్లుగా బాక్సాఫీస్ వర్గాల టాక్‌.

ఆ రెండు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి కానీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో ఇంగ్లీష్ సినిమా 'మెగ్‌ 2 ది ట్రెంచ్‌' సినిమా మాత్రం నిరాశ పరిచింది.

2018 లో హాలీవుడ్‌ లో వచ్చిన మెగ్‌ సినిమాకు సీక్వెల్‌ గా 'మెగ్‌ 2 ది ట్రెంచ్‌' సినిమా వచ్చింది.

సముద్ర గర్భంలో ఉండే కొత్త జాతులను, రహస్యాలను కనిపెట్టేందుకు కార్పోరేట్‌ సంస్థలు చేసే ప్రయత్నాలను ఈ సినిమాలో చూపించడం జరిగింది. సినిమాలో సన్నివేశాలు రియాల్టీకి చాలా దూరంగా ఉన్నాయి అనిపిస్తుంది.

ముఖ్యంగా డైనోసార్ల సన్నివేశాలు మరియు షార్క్‌ సన్నివేశాలు మరీ ఓవర్ గా అనిపించాయి. అంతే కాకుండా చాలా ఆసక్తికరంగా ఉంటుందని భావించిన క్లైమాక్స్ మరీ సిల్లీగా ఉందంటూ విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి మెగ్ 2 సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. హాలీవుడ్‌ లో కూడా ఇదే పరిస్థితిని ఈ సినిమా ఎదుర్కొంటుందని సమాచారం అందుతోంది.