తెలుగు చింపేసిన మిథా రఘునాదన్!
దేశ భాషలందు తెలుగు లెస్స. కానీ ఆ తెలుగును తెలుగు వాళ్లే సరిగ్గా మాట్లాడలేని పరిస్థితి అప్పుడప్పుడు సినిమా ఇండస్ట్రీలో కనిపిస్తుంటుంది.
By: Tupaki Desk | 28 Jun 2025 2:53 PM ISTదేశ భాషలందు తెలుగు లెస్స. కానీ ఆ తెలుగును తెలుగు వాళ్లే సరిగ్గా మాట్లాడలేని పరిస్థితి అప్పుడప్పుడు సినిమా ఇండస్ట్రీలో కనిపిస్తుంటుంది. అలాంటి సందర్భం చూసినప్పుడల్లా తెలుగు భాష ఏమైపోతుందనే ఆందోళన వ్యక్తమవుతుంటుంది. తెలుగు మాట్లాడటం వచ్చినా? మాట్లాడని వారు చాలా మంది ఉన్నారు. స్వచ్ఛమైన తెలిసిన తెలుగు భాషలో మాట్లాడితే నామోషీ ఫీలవుతుంటారు. ప్రతిగా ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే అందరూ తెలుగు నేర్చుకోలేకపోయినా కొందరు నేర్చు కుంటారు.
నేర్చుకున్నంత వరకూ తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు. ఇది హర్షించదగ్గ విషయం. వరుసగా అవకాశాలు వస్తున్నాయంటే తెలుగు ట్యూటర్ ని పెట్టుకుని భాషపై పట్టు సంపాదించే ప్రయత్నం చేస్తుం టారు. నార్త్ కంటే సౌత్ నుంచి వచ్చిన భామలు తెలుగు భాష ఎక్కువగా మాట్లాడుతుంటారు. లేదంటే? కాజల్ అగర్వాల్, తమన్నా తెలుగు మాట్లాడినట్లే ఉంటుంది. కానీ ఓ తమిళ అమ్మాయి ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వకుండా తెలుగు మాట్లాడిన తీరు చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది. ఆమె మీథా రఘునాదన్.
'3బీహెచ్ కె' సినిమాలో హీరోయిన్. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా అమ్మడు తెలుగు ఎంత చక్కగా మాట్లాడిందంటే? తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్ని స్తున్నాను. ఏవైనా తప్పులుంటే క్షమించండని స్పీచ్ మొదలు పెట్టింది. మీరు నన్ను 'గుడ్ నైట్' సినిమాలో చూసి ఉంటారు. అందులో నా పాత్ర పట్ల చూపించిన ప్రేమకు ధన్య వాదాలు. చిన్నప్పుడు స్కూల్ ట్రిప్ కోసం హైదరాబాద్ తొలిసారి వచ్చాను. ఆ తర్వాత హైదరాబాద్ రావడం ఇదే.
ఈ మధ్యలో ఎప్పుడూ రాలేదు. '3 బీహెచ్ కె' ని ప్రేమతో హృదయపూర్వకంగా చేసాం. అందరూ తప్పక చూడండి. ఆ సినిమా తర్వాత తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తున్నాయని ఆశిస్తున్నా అంటూ ఎంతో చక్కాగా మాట్లాడింది. మీథా రఘునాధన్ తెలుగు మాట్లాడటం చూసి పక్కనే ఉన్న సిద్దార్ధ్ నోరెళ్ల బెట్టాడు. తమిళ అమ్మాయి ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతుందేంటని ఓకింత ఆశ్చర్యపోయాడు. సాధారణంగా తమీళియన్స్ తెలుగు మాట్లాడటానికి ఇష్టపడరు. భాషా బేధంతో విడిపోయిన రాష్ట్రం కావడంతో తెలుగు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటారు. కానీ మీథా రఘునాదన్ మాత్రం సినిమా రిలీజ్ కు ముందే తెలుగు వాళ్ల మనసుల్లో స్థానం సంపాదించింది.
