Begin typing your search above and press return to search.

మీరా జాస్మిన్.. చిట్టి గౌనులో స్టన్నింగ్ అందాలు

అమెరికాలో ఉన్న మీరజాస్మిన్ అక్కడ నగరం వీధుల్లో సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించింది.

By:  Tupaki Desk   |   13 Oct 2023 4:43 PM GMT
మీరా జాస్మిన్.. చిట్టి గౌనులో స్టన్నింగ్ అందాలు
X

చేసింది ఎక్కువగా తమిళ్ మలయాళం సినిమాలే అయినప్పటికీ కూడా మీరా జాస్మిన్ తెలుగు ఇండస్ట్రీలోని మర్చిపోలేని గుర్తింపును అందుకుంది. ఇక బాక్సాఫీస్ వద్ద ఆమెకు అగ్ర హీరోలతో అవకాశాలు దక్కిన సందర్భాలు కూడా చాలా తక్కువ. ముఖ్యంగా రవితేజ భద్ర సినిమాతో ఆమెకు మంచి క్రేజ్ దక్కింది. ఇక పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ లో కూడా హీరోయిన్గా నటించిన మీరాజాస్మిన్ అప్పట్లో మాత్రం హోమ్లీ హీరోయిన్ గా కనిపించింది.


హీరోయిన్ గా 2010 వరకు ఎంతో బిజీగా కనిపించినా ఆమె ఎనాడు గ్లామర్ డోస్ మాత్రం పెంచలేదు. వీలైనంతవరకు ఎక్కువగా చుడిదార్ చీరలలొనే కనిపించేది. అయితే హీరోయిన్గా ఆమెకు అవకాశాలు తగ్గిన తర్వాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ లో ఊహించిన విధంగా దర్శనమిస్తోంది. ప్రస్తుతం ఆమె వయసుకు తగ్గ పాత్రలు చేస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది.


మీరా జాస్మిన్ గ్లామరస్ ఫోటోలు చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. ఇక రీసెంట్ గా అమ్మడు మరోసారి చిట్టి గౌనులో దర్శనమించింది. అమెరికాలో ఉన్న మీరజాస్మిన్ అక్కడ నగరం వీధుల్లో సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ఇక ఆ ఫోటోలలో ఆమె చిన్న గౌనులో ఇచ్చిన స్టిల్స్ మాత్రం మామూలుగా లేవు.

అలాగే తన ఎద అందాలతో కూడా ఆమె ఎంతగానో మైమరిపించింది. ఇక ప్రస్తుతం ఆ ఫోటోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా ఆమె గ్లామరస్ స్టిల్స్ తో బాగానే ఎట్రాక్ట్ చేసింది. కానీ ఈ ఫోటోలు మాత్రం అంతకుమించి అనేలా ఉన్నాయి అంటూ ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

ఇక ఈ బ్యూటీ చేతిలో అయితే ప్రస్తుతం తమిళ్ మలయాళంలో రెండు సినిమాలు ఉన్నాయి. అలాగే తెలుగులో కూడా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక అవకాశం వస్తే ఐటెం సాంగ్స్ లో కూడా చేయాలని ఆలోచనతో ఉన్నట్లు టాక్. కానీ ఇప్పటివరకు మాత్రం ఆ రూట్లో ఈ బ్యూటీకి సరైన అవకాశాలు రాలేదు.