Begin typing your search above and press return to search.

మీరా జాస్మిన్.. ఇన్నాళ్ళకు ఫుల్ లెన్త్ రోల్?

తాజాగా మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాలని చూస్తుంది. ఇటీవల విమానం లాంటి సినిమాలో ఓ చిన్న రోల్ లో మెరిసింది.

By:  Tupaki Desk   |   16 Aug 2023 1:30 PM GMT
మీరా జాస్మిన్.. ఇన్నాళ్ళకు ఫుల్ లెన్త్ రోల్?
X

మీరా జాస్మిన్ ది చూపు తిప్పుకోనివ్వలేని అందం. ఆమెను స్పెషల్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రవితేజ వంటి స్టార్ హీరోల సరసన కూడా నటించింది. టాలీవుడ్ లో ఆమె నటించిన సినిమాలన్నీ దాదాపు హిట్ అయ్యాయి. కానీ సడెన్ గా ఏమైందో సినిమాలకు దూరమైంది. చాలా కాలం అసలు ఆమె ఎవరికీ కనిపించను కూడా కనిపించలేదు.

కానీ, తాజాగా మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాలని చూస్తుంది. ఇటీవల విమానం లాంటి సినిమాలో ఓ చిన్న రోల్ లో మెరిసింది. కానీ, ఈ సారి ఆమెకు అలా చిన్న రోల్స్ లా కాకుండా, ఫుల్ లెన్త్ రోల్ ఛాన్స్ కొట్టేసిందని సమాచారం. అది కూడా ఓ యంగ్ హీరో సినిమాలో ఆమెకు ఛాన్స్ దొరికినట్లు తెలుస్తోంది.

యంగ్ హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతోంది.ఈ సినిమాలో రీతూ వర్మను హీరోయిన్ గా నటిస్తోంది. కాగా, మరో ప్రధాన పాత్రలో మీరా జాస్మిన్ ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి స్వాగ్ అనే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. నిజానికి హీరోయిన్లకు సెకండ్ ఇన్నింగ్స్ అంటే, అక్క, వదిన లాంటి పాత్రలు లేదంటే, ఏ లాయర్, పోలీస్ లాంటి పాత్రలు మాత్రమే వస్తాయి.

హీరోయిన్ గా రావడం చాలా అరుదు. కానీ, మీరా జాస్మిన్ కి హీరోయిన్ గా ఛాన్సులు రావడం అందరినీ షాకింగ్ కి గురి చేస్తుంది. మీరా జాస్మిన్ కెరీర్ మొదలుపెట్టిన కొత్తలో కొంచెం బొద్దుగా ఉండేది. కానీ చాలా అందంగా ఉండేది, ఇప్పుడు ఆమె వయసు నాలుగు పదులు దాటింది. సన్నగా, నాజుకు తీగలా మారింది. దీంతో, ఆమె అందం మరింత ఎక్కువగా పెరిగింది.

అందుకే, ఆమెకు మళ్లీ అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇక సోషల్ మీడియాలోనూ తన పోస్టులతో మీరా జాస్మిన్ అదరగొడుతూ ఉంటుంది. ముఖ్యంగా క్లీవేజ్ అందాలతో అందరినీ ఆకర్షిస్తోంది. ఇక, మీరా జాస్మిన్ గుడుంబా శంకర్, భద్ర వంటి సినిమాల్లో నటించింది.