Begin typing your search above and press return to search.

బంగారం మీరా చోప్రా పెళ్లి మొద‌టి ఫోటో

ఆహ్వాన కార్డ్, హల్దీ, సాత్ ఫెరాస్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   13 March 2024 4:12 AM GMT
బంగారం మీరా చోప్రా పెళ్లి మొద‌టి ఫోటో
X

ప్రియాంక చోప్రా కజిన్ మీరా చోప్రా పెళ్లి చర్చనీయాంశమైంది. వ్యాపారవేత్త రక్షిత్ కేజ్రీవాల్‌తో మూడేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. అవును ఈరోజే మీరా, రక్షిత్ పెళ్లి చేసుకున్నారు. ఈ జంట‌ పెళ్లి మార్చి 12న జైపూర్‌లో జరిగింది. జైపూర్‌లోని బ్యూనా విస్టా లగ్జరీ గార్డెన్ స్పా రిసార్ట్‌లో వివాహం జరిగింది. మెహెందీ - సంగీత్ వేడుకలు మార్చి 11న జరిగాయి. ఇప్పుడు, మీరా తన పెళ్లికి సంబంధించిన కొన్ని అద్భుత‌మైన ఫోటోల‌ను ఇన్ స్టాలో షేర్ చేసింది.


ఆహ్వాన కార్డ్, హల్దీ, సాత్ ఫెరాస్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఇక ఈ పెళ్లిలో మీరా చోప్రా ఎరుపు రంగు డిజైన‌ర్ లెహంగా ధ‌రించి ఎంతో అందంగా క‌నిపించింది. ఎంబ్రాయిడ‌రీ తో భారీత‌నం నిండిన ఈ లెహంగా లుక్ మీరా అందాన్ని పదింత‌లు పెంచింది. వ‌రుడు పూర్తిగా రాయ‌ల్ వైట్ అండ్ వైట్ షేర్వాణీలో అందంగా క‌నిపించాడు. అత‌డు బ్రౌన్ గ్లాసెస్ ధ‌రించి ఠీవిగా క‌నిపించాడు.


మీరా పెళ్లి మండపంలోకి ప్రవేశించిన చిత్రాన్ని కూడా షేర్ చేసింది. ఈ ఫోటోల‌ను షేర్ చేస్తూ మీరా ఇలా రాశారు, ``ఎప్పటికీ ఈ ఆనందం, తగాదాలు, నవ్వు, కన్నీళ్లు, జీవితకాల జ్ఞాపకాలలో... హర్ జనమ్ తేరే సాత్ #మేరా`` అనే అంద‌మైన క్యాప్ష‌న్ ఇచ్చింది.


ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రా పెళ్లికి హాజరు కాలేదని తెలుస్తోంది. మీరా కజిన్ `బిగ్ బాస్ 17` సెకండ్ రన్నరప్ మన్నారా చోప్రా కూడా పెళ్లిలో కనిపించలేదు. మీరా బిగ్ బాస్ 17లో ఉన్నప్పుడు మన్నారాకు చాలా సపోర్ట్ చేసింది. ఈ పెళ్లికి సందీప్ సింగ్, ఆనంద్ పండిట్, అర్జన్ బజ్వా, గౌరవ్ చోప్రా సహా పరిశ్రమలోని మీరా సన్నిహితులు హాజరయ్యారు.


మీరా ప్రధానంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ చిత్రాలలో పనిచేస్తోంది. 1920: లండన్ చిత్రంతో శర్మన్ జోషితో కలిసి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. గ్యాంగ్స్ ఆఫ్ గోస్ట్స్, సెక్షన్ 375, సఫేద్ స‌హా ప‌లు చిత్రాల్లో న‌టించింది. టాలీవుడ్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర‌స‌న బంగారం చిత్రంలోను న‌టించింది. మీరా క్యూట్ అందాల‌కు ప‌వ‌న్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. మీరా .. ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రాల తండ్రి తరపు కజిన్ సోదరి.