Begin typing your search above and press return to search.

బంగారం భామ సైలెంట్ గా పేల్చేసిందే!

ఆ ర‌క‌మైన స్వేచ్ఛా అనుమతులు ముందుగా పొందిన త‌ర్వాతే పెళ్లి పీట‌లెక్కుతున్నారు.

By:  Tupaki Desk   |   8 March 2024 8:17 AM GMT
బంగారం భామ సైలెంట్ గా పేల్చేసిందే!
X

హీరోయిన్లు అంతా ఒక్కొక్క‌రుగా పెళ్లి భాజాలు మ్రోగిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్రేమించిన వాడిని పెళ్లాడేసి ధాంప‌త్య జీవితంలోకి అడుగు పెడుతున్నారు. అలాగ‌ని సినిమాల‌కు దూరంగా ఉండ‌లేదు. పెళ్లికి- సినిమా ల‌కి ఏమాత్రం సంబంధం లేద‌ని ..దేని ప‌ని దానిదే అంటూ కొన‌సాగుతున్నారు. ఆ ర‌క‌మైన స్వేచ్ఛా అనుమతులు ముందుగా పొందిన త‌ర్వాతే పెళ్లి పీట‌లెక్కుతున్నారు. తాజాగా మీరా చోప్రా కూడా పెళ్లి క‌బురు చెప్పేసింది.


ముంబై బేస్డ్ బిజినెస్ మ్యాన్ ర‌క్షిత్ శెట్టిని వివాహం చేసుకుంటున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించింది. మూడేళ్ల‌గా అమ్మ‌డు అత‌డిలో సీరియ‌స్ లో ఉందిట‌. ఈ విష‌యం ఇంత‌వ‌ర‌కూ ఎక్క‌డా లీక్ అవ్వ‌లేదు. సైలెంట్ గా ఇప్పుడు వెడ్డింగ్ కార్డు కూడా ప్రింట్ చేసి మా పెళ్లికి వ‌చ్చేయండి అంటూ ట్విస్ట్ ఇచ్చింది. వివాహం జైపూర్ లోని విస్తా ల‌గ్జ‌రీ గార్డెన్ లో జ‌రుగుతుంది. ఈ నెల 11న మొంహ‌దీ వేడుక‌లో పెళ్లి హ‌డావుడి మొద‌ల‌వుతుంది.

అదే రోజు సాయంత్ర సంగీత్ ..కాక్ టెయిల్ పార్టీ ఉంటుంది. ఆ మ‌రుస‌టి పెళ్లి జ‌రుగుతుంది. కేవ‌లం రెండు రోజులు మాత్రమే మీరా చోప్రా పెళ్లి కార్య‌క్ర‌మం ప్లాన్ చేసుకుంది. వాస్త‌వానికి ఈవేడుక‌ను మూడు రోజ‌లు పాటు నిర్వ‌హిస్తుంటారు. కానీ మీరా చోప్రా రెండు రోజుల‌తోనే స‌రిపెడుతుంది. అంటే హ‌ల్దీ ఫంక్ష‌న్ 12వ‌తేదీని జ‌రుగుతుంది. అదే రోజు సాయంత్రం నాలుగున్న‌ర గంట‌ల‌కు పెళ్లి ముహూర్తంగా తెలుస్తోంది.

అలాగే ఆ రాత్రికే రిసెప్ష‌న్ కూడా ఏర్పాటు చేసారు. పెళ్లికి వచ్చిన వారు పెళ్లిచేసుకుని భోజనాలు చేసి వెళ్లిపోయేలా ఏర్పాట్లు చేసుకుంది. రిసెప్ష‌న్ అంటూ ముంబైలో మ‌ళ్లీ ఎలాంటి ఈవెంట్ నిర్వ‌హ‌చ‌లేదు. మూడు రోజుల పెళ్లిని రెండు రోజుల్లోనే ముగించి త‌న ప‌ని తాను బిజీ కానుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టించిన `బంగారం` సినిమాతో మీరా చోప్రా ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత వాన లాంటి చిత్రంలోనూ న‌టించి మంచి గుర్తింపు ద‌క్కించుకుంది. ఆ త‌ర్వాత `మారో`..`గ్రీకు వీరుడు` లాంటి చిత్రాల్లో న‌టించింది. అలాగే హిందీలోనూ కొన్ని సినిమాలు చేసింది.