Begin typing your search above and press return to search.

క‌జిన్స్ పీసీ-పారి అండ‌దండ‌లు లేవ‌న్న‌ మీరా చోప్రా

తాజా ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్లో మీరా చోప్రా త‌న సోద‌రీమ‌ణులైన‌ ప్రియాంక చోప్రా - పరిణీతి చోప్రాతో అంత‌గా అనుబంధం లేకపోవడం గురించి మాట‌ల మ‌ధ్య‌లో ఓపెనైంది.

By:  Tupaki Desk   |   24 Dec 2023 5:57 AM GMT
క‌జిన్స్ పీసీ-పారి అండ‌దండ‌లు లేవ‌న్న‌ మీరా చోప్రా
X

బాలీవుడ్ -హాలీవుడ్ రెండు పరిశ్ర‌మ‌ల్లో ఏక‌కాలంలో పనిచేస్తున్న భార‌త‌దేశపు బిగ్గెస్ట్ స్టార్ ప్రియాంక చోప్రా(పీసీ). పీసీ సోద‌రి పరిణీతి చోప్రా హిందీ పరిశ్రమలో పాపుల‌ర్ నటి. చోప్రా సోదరీమణులకు ప్ర‌పంచ‌వ్యాప్త గుర్తింపు ఉంది. ప్రియాంక - పరిణీతి ఇద్ద‌రికీ కజిన్స్ మన్నారా చోప్రా- మీరా చోప్రా. మన్నారా ప్రస్తుతం బిగ్ బాస్ 17 ఇంటిలో ఉండగా, మీరా తన కొత్త సినిమా 'సఫేద్‌'ను ప్రమోట్ చేస్తోంది.

తాజా ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్లో మీరా చోప్రా త‌న సోద‌రీమ‌ణులైన‌ ప్రియాంక చోప్రా - పరిణీతి చోప్రాతో అంత‌గా అనుబంధం లేకపోవడం గురించి మాట‌ల మ‌ధ్య‌లో ఓపెనైంది. మీరా చోప్రా మాట్లాడుతూ.. ప్రియాంక చోప్రా- పరిణీతి చోప్రాతో స్నేహం లేదా గొప్పగా చెప్పుకోవడం కపటం (అబ‌ద్ధం)గా ఉండేదని వెల్లడించింది. ప్రారంభ‌రోజుల్లో పరిశ్రమలో వారి మద్దతు ఉంటుంద‌నే సాధారణ అంచనాలు ఉన్నప్పటికీ.. తనకు వారి నుంచి ఏదీ అందలేదని మీరా చెప్పింది. తన కజిన్‌లను ఎలాంటి సహాయం కోరలేదని... వారు ఎలాంటి సహాయం అందించలేదని కూడా పేర్కొంది. తాను సహాయం కోరే వ్యక్తిని కాదని మీరా చోప్రా పేర్కొంది.

పీసీ-ప‌రిణీతితో క‌లిసి మ‌న్నారా- మీరా చోప్రా కూడా ఒకే ఇంట్లో ఉండేవార‌ట‌. వారంతా ఒక పెద్ద ఉమ్మడి కుటుంబంగా, ఒకే ఇంట్లో ఉండేవాళ్ల‌మ‌ని కూడా మీరా గుర్తు చేసుకున్నారు. కానీ ఇంట్లో ఎవరైనా (పీసీ) అపారమైన విజయాన్ని సాధించినప్పుడు ఇతరులకు స‌హ‌జంగానే గుర్తింపు త‌క్కువ‌గా ఉంటుంది... అని మీరా చోప్రా అన్నారు. మ‌న్నారా చోప్రా కూడా ఇంత‌కుముందు తెలుగు సినిమాల ప్ర‌మోష‌న్స్ లో త‌న‌కు త‌న క‌జిన్స్ స‌పోర్ట్ అవ‌స‌రం లేద‌ని, అలా కోరుకోన‌ని అన్నారు. కానీ వారి ప్ర‌భావం త‌న‌పై ఉంటుంద‌ని కూడా తెలిపారు.