Begin typing your search above and press return to search.

బిజినెస్‌మేన్‌ని పెళ్లాడుతున్న 'బంగారం'

ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర‌స‌న 'బంగారం' చిత్రంలో న‌టించిన మీరా చోప్రా క్యూట్ లుక్స్ హాట్ కంటెంట్ కి యువ‌త‌రం హృద‌యాలు బ్రేక‌యిన సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   21 Feb 2024 4:59 PM GMT
బిజినెస్‌మేన్‌ని పెళ్లాడుతున్న బంగారం
X

ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర‌స‌న 'బంగారం' చిత్రంలో న‌టించిన మీరా చోప్రా క్యూట్ లుక్స్ హాట్ కంటెంట్ కి యువ‌త‌రం హృద‌యాలు బ్రేక‌యిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రో బిజినెస్ మేన్ హృద‌యాన్ని దోచేసింది ఈ అమ్మ‌డు. అత‌డు త‌న చిన్న‌నాటి స్నేహితుడు అని తెలిసింది. తాజా సమాచారం మేర‌కు మీరా చోప్రా తన చిరకాల ప్రియుడిని జైపూర్‌లో వివాహం చేసుకోబోతున్నట్లు స‌మాచారం. ఈ జంట మూడేళ్లుగా డేటింగ్‌లో ఉన్నార‌ని క‌థ‌నాలొచ్చాయి.

మీరా పెళ్లి వచ్చే నెలలో పింక్ సిటీలో మార్చి 11, 12 తేదీల్లో జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే సన్నాహాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మూడేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న తన వ్యాపారవేత్త బాయ్‌ఫ్రెండ్ ఎవరనేది ఇంకా వెల్లడించనప్పటికీ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించినందున ఫ్యాన్స్ లో ఉత్కంఠ నెలకొంది. ప్ర‌స్తుతం పెళ్లికి సంబంధించిన విశేషాలను గోప్యంగా ఉంచారు. అయితే సన్నాహాలు మాత్రం శరవేగంగా జరుగుతున్నాయి.

ఇంతకుముందు ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్‌ను వివాహానికి ఆహ్వానిస్తారా? అని మీరా చోప్రాను ప్ర‌శ్నించ‌గా.. వారికి ముందస్తు కట్టుబాట్లు లేక‌పోతే క‌చ్చితంగా ఉత్సవాలకు హాజరవుతారని వెల్లడించింది మీరా. గత సంవత్సరం పరిణీతి చోప్రా తన చిరకాల ప్రియుడు రాఘవ్ చద్దాను సెప్టెంబర్ 24న ఉదయపూర్‌ లీలా ప్యాలెస్‌లో పెళ్లాడింది. ఈ పెళ్లి సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితుల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగింది. ప్రియాంక చోప్రా ఈ పెళ్లికి హాజ‌రు కాలేక‌పోయింది.

మీరా చోప్రా బంగారం త‌ర్వాత ప‌లు తెలుగు చిత్రాల్లో న‌టించింది. కానీ స‌రైన స‌క్సెస్ రాలేదు. దాంతో ఇరుగు పొరుగు భాష‌ల్లోను న‌టిగా కొన‌సాగింది. 1920 లండన్, గ్యాంగ్ ఆఫ్ గోస్ట్స్, సెక్షన్ 375 వంటి బాలీవుడ్ చిత్రాల్లో న‌టించింది. 38 ఏళ్ల మీరా చోప్రా చివరిగా OTT చిత్రం సఫెద్ (2023)లో కనిపించింది.