Begin typing your search above and press return to search.

PSPK బంగారం మీరా చోప్రా పెళ్లి!

మీరా స్నేహితులు, పరిశ్రమ సహోద్యోగుల కోసం ముంబైలో తర్వాత చిన్న రిసెప్షన్‌ను నిర్వహించనున్నారు

By:  Tupaki Desk   |   28 Dec 2023 4:29 AM GMT
PSPK బంగారం మీరా చోప్రా పెళ్లి!
X

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర‌స‌న బంగారం చిత్రంలో న‌టించింది మీరా చోప్రా. మీరా అంద‌చందాలు న‌ట‌న‌కు తెలుగు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. కానీ ఎందుక‌నో మీరా తెలుగులో ఆశించిన‌న్ని అవ‌కాశాల్ని అందుకోలేక‌పోయింది. ఆ త‌ర్వాత బాలీవుడ్ లో అడ‌పాద‌డ‌పా న‌టించింది. కానీ సినీకెరీర్ ప‌రంగా హైని అందుకోలేక‌పోయింది.

ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ త‌న క‌జిన్ గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా పేరును ఉప‌యోగించుకోవ‌డానికి తాను ఆస‌క్తిగా లేన‌ని మీరా ప్ర‌క‌టించింది. మీరా న‌టించిన సఫేద్ చిత్రం త్వరలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుండ‌గా, ప్ర‌మోషన్స్ లో బిజీగా ఉన్న మీరా చోప్రా మంగళవారం (డిసెంబర్ 26) మీడియాతో ప్రత్యేక ఇంటరాక్షన్‌లో తన పెళ్లి గురించి ఓపెనైంది. ఇప్ప‌టికే మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి క‌దా? అని ప్ర‌శ్నించ‌గా..చివ‌రికి మీరా త‌న‌ వివాహం జరుగుతోందని ధృవీకరించింది. ''వును నిజమే.. నేను పెళ్లి చేసుకుంటున్నాను.. 2024 ఫిబ్రవరి నెలాఖరున పెళ్లి జరగనుంది. అందుకు సంబంధించిన సన్నాహాల్లో నా కుటుంబ సభ్యులు చురుగ్గా నిమగ్నమయ్యారు. వేడుక‌ను మా కుటుంబీకులే నిర్వహిస్తున్నారు.. ఈ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. రాజస్థాన్‌లో కేవలం 150 మంది అతిథులు మాత్రమే హాజ‌ర‌వుతున్నారు''అని మీరా చెప్పారు.

మీరా స్నేహితులు, పరిశ్రమ సహోద్యోగుల కోసం ముంబైలో తర్వాత చిన్న రిసెప్షన్‌ను నిర్వహించనున్నారు. అయితే కాబోయే భర్త వివరాలు ఇంకా తెలియరాలేదు. ఇటీవ‌ల క్రిస్మస్ సందర్భంగా, మీరా ఒక మిస్టరీ మ్యాన్‌తో ఉన్న ఓ ఫోటోని షేర్ చేసుకున్నారు. ఇది త‌న పెళ్లి గురించి పుకార్లకు దారితీసింది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఫోటోలో ఆ వ్యక్తి మీరాను కౌగిలించుకున్నట్లు కనిపించింది. 'ప్యార్ వాలా క్రిస్మస్' అని ఈ ఫోటోకు మీరా క్యాప్షన్ ఇచ్చింది. దీంతో మీరా నిఖా ఖాయ‌మైంద‌ని అంతా భావించారు.

2016లో విక్రమ్ భట్ '1920: లండన్' చిత్రంలో శర్మన్ జోషితో కలిసి మీరా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. త‌దుప‌రి రిచా చద్దా, అక్షయ్ ఖన్నాతో కలిసి 'గ్యాంగ్ ఆఫ్ గోస్ట్స్'లో న‌టించింది. సెక్షన్ 375'లో కూడా భాగమైంది. ప్రధానంగా హిందీ- తెలుగు చిత్ర పరిశ్రమలలో పనిచేసింది. ప్ర‌స్తుత కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. మీరా తదుపరి చిత్రం సఫేద్‌లో కనిపిస్తుంది. సందీప్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అభయ్ వర్మ, బర్ఖా బిష్త్, జమీల్ ఖాన్, ఛాయా కదమ్ త‌దిత‌రులు నటించారు. ఓ ట్రాన్స్‌జెండర్‌ వితంతువు మధ్య సాగే ప్రేమకథ ఇది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను కేన్స్ 2022లో మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ ఆవిష్కరించారు. స‌ఫేద్ చిత్రం గురించి మీరా మాట్లాడుతూ ''సందీప్ ఇచ్చిన స్క్రిప్ట్ చదివినప్పుడు, నేను చాలా ఉబ్బితబ్బిబ్బయ్యాను. కానీ దర్శకుడిగా సందీప్‌కి మొదటి సినిమా కాబట్టి మేం షూటింగ్ ప్రారంభించే వరకు ఏమీ తెలియదు. మా షూటింగ్ మొదటి రోజు తర్వాత నేను సురక్షితమైన చేతుల్లో ఉన్నానని నాకు తెలుసు. అతడు ఒక వితంతువు దుస్థితిని విజయవంతంగా తెర‌పైకి తెచ్చాడు. ఈ పాత్రకు ఎంపిక కావడం నాకు గర్వకారణంగా భావిస్తున్నాను'' అని తెలిపింది.