Begin typing your search above and press return to search.

ఆ హీరో పై మనసు పారేసుకున్న మీరా చోప్రా..!

తాజాగా తన సోషల్ మీడియా ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది. ఆ సమయంలో మీ అభిమాన హీరో ఎవరు అని ఫ్యాన్స్ అడగగా, ప్రభాస్ అంటూ సమాధానం చెప్పింది.

By:  Tupaki Desk   |   19 Aug 2023 12:13 PM GMT
ఆ హీరో పై మనసు పారేసుకున్న మీరా చోప్రా..!
X

మీరా చోప్రా, ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్. చేసింది చాలా తక్కువ సినిమాలే. హీరోయిన్ గా టాలీవుడ్ ని ఏలేద్దాం అనుకుంది. కానీ, ఆమె నటించిన ఒక్క సినిమా కూడా విజయం సాధించలేకపోయాయి. కేవలం వాన అనే సినిమా ఒక్కటే మ్యూజికల్ హిట్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ పక్కన బంగారం సినిమాలో నటించినా, ఆ సినిమా ప్లాప్ కావడంతో మళ్లీ పత్తాలేదు.

అయితే, సినిమాలతో పాపులర్ కాలేకపోయినా, సోషల్ మీడియా ద్వారా తన పాపులారిటీ పెంచుకోవడానికి ఈ అమ్మడు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఏదో ఒక విషయంపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటుంది. తాజాగా తన సోషల్ మీడియా ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది. ఆ సమయంలో మీ అభిమాన హీరో ఎవరు అని ఫ్యాన్స్ అడగగా, ప్రభాస్ అంటూ సమాధానం చెప్పింది. గతంలో ఇలాగే ఓసారి మీ ఫేవరేట్ హీరో ఎవరు అంటే మహేష్ బాబు అని చెప్పిన ఈ బ్యూటీ, ఇప్పుడు ప్రభాస్ పేరు చెప్పడం విశేషం.

ఇదిలా ఉండగా, గతంలో ఓసారి తనకు ఎన్టీఆర్ ఎవరో తెలీదు అంటూ కామెంట్ చేసింది. టాలీవుడ్ లో పని చేసి, ఎన్టీఆర్ ఎవరో తెలీదా నీకు అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆమెకు విరుచుకుపడ్డారు. ఒక విధంగా చెప్పాలంటే ఆమెను ట్రోల్ చేసి, కామెంట్స్ లోనే భయపెట్టేశారు.

దీంతో, ఆ విషయం పై అప్పట్లో నానా రచ్చే జరిగింది. ఈ విషయంలో మరో హీరోయిన్ పాయల్ ఘోష్ ఎంటర్ అవ్వడం, ఆమె మీరా చోప్రా కి వ్యతిరేకంగా ఎన్టీఆర్ కి సపోర్ట్ చేయడం పెద్ద రాద్దాంతమే జరిగింది.

అయితే, మీరా చోప్రా ఇటీవల రాజకీయాల గురించి కూడా కామెంట్స్ చేసింది. బీజేపీకి మద్దతుగా మీరా చోప్రా ట్వీట్ వేసింది. దేశంలో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత వాతావరణం, మత ఘర్షణలు కేవలం బీజేపీ వల్లే జరుగుతోందని కామెంట్లు చేస్తుంటారు.. మరి ఫ్రాన్స్, లండన్, ఇటలీ, స్వీడెన్ దేశాల్లోనూ బీజేపీ ప్రభుత్వమే ఉందా? అని ప్రశ్నించింది. ఒక్కసారిగా ఆమె చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

కేవలం ఫేమస్ అవ్వాలనే మీరా చోప్రా ఇలా బీజేపీకి సపోర్ట్ చేస్తోందనే విమర్శలు చేశారు. ఏది ఏమైనా మీరా చోప్రా ఏది చేసినా సెన్సేషన్. ఇప్పుడు హీరోల విషయంలోనూ అంతే, ప్రభాస్ కి ఇప్పుడు ఫుల్ క్రేజ్ ఉండటంతో, ఆయనే తన ఫేవరేట్ అని చెప్పింది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.