గుడ్డు కూడా తినని దాన్ని మాంసం బిజినెస్ చేస్తానా?
బాలీవుడ్ లో సెలబ్రిటీ కల్చర్ ఎలా ఉంటుందన్నది చెప్పాల్సిన పనిలేదు. పార్టీలు..పబ్ కల్చర్ సర్వ సాధారణం.
By: Tupaki Desk | 7 July 2025 1:00 AM ISTబాలీవుడ్ లో సెలబ్రిటీ కల్చర్ ఎలా ఉంటుందన్నది చెప్పాల్సిన పనిలేదు. పార్టీలు..పబ్ కల్చర్ సర్వ సాధారణం. వీకెండ్ అయితే పార్టీలు...వీకెండ్ తో పనిలేకుండా పార్టీలు చేసుకునే హీరోయిన్ గ్యాంగ్ లు ఎన్నో ఉన్నాయి. ఈ పార్టీలో ఆఫ్ ది కెమెరా వెనుక ఉండే సెలబ్రిటీలు కూడా జాయిన్ అవుతుంటారు. చాలా వరకూ హీరోల భార్యలంటే సినిమా రంగానికి చెందిన వారే ఉంటారు. కాబట్టి వాళ్లు తరుచూ హాజర వుతుంటారు.
కానీ షాహిద్ కపూర్ సతీమణి మీరా రాజ్ పుత్ వాళ్లందరికీ భిన్నం. ఆమె ప్రయాణం మాత్రం ఎంతో స్పూర్తివంతమైంది. ఆమె సినిమా నటి కాదు. బిజినెస్ ఉమెన్. వ్యాపార రంగంలో ఆమె గొప్ప సక్సస్ సాధించారు. ఈ నేపథ్యంలో ఓ రెస్టారెంట్ లో కూడా భాగస్వామిగా మారారని పోర్స్బ్ ఇండియా ప్యానెల్ చర్చలో ఈ అంశం ఆమె ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో మీరా రాజ్ పుత్ సమాధానంతో తానెంత గొప్ప వ్యక్తిత్వం గలవారు? అన్నది ప్రూవ్ అయింది.
`నేను శాఖాహారిని. గుడ్డు కూడా తినను. మద్యపానం, మాంసాహారం వంటి వాటికి దూరం. అలాంటి నేను రెస్టారెంట్ ల్లో మద్యం, మాంసాహారాన్ని విక్రయించే వ్యాపారం ఎందుకు చేస్తాను. ఇది నా నమ్మకాలకు పూర్తి విరుద్దం. ఏ వ్యాపారమైనా లాభాల కోమే చేస్తాం. కానీ అది వ్యక్తిగత విలువలకు భంగం కలిగించ కూడదు. నాపై నమ్మకం ఉన్న వారికి, నా కుటుంబంతో సత్ససంబంధాలుంటే? నేను నమ్మే విషయాల్లో నాకో స్పష్టత ఉండాలి.
ఎలాంటి నిర్ణయం తీసుకున్నా? అది అంతరాత్మ అంగీకరించేలా ఉండాలి. నా వ్యాపారాలన్నింటి విష యంలో కొన్ని నియమ నిబంధలున్నాయి. వాటికి లోబడే పని చేస్తాను. మీరా రాజ్ పుత్ హోలిస్టిక్ హెల్త్, నేచురల్ లివింగ్, స్కిన్ కేర్ రంగాల్లో రాణిస్తున్నారు. అంతే కాదు సోషల్ మీడియా ద్వారా ఆరోగ్యకరమైన జీవిన శైలిని ప్రోత్సహిస్తుంటారు.