Begin typing your search above and press return to search.

మీనాక్షి.. మీమ్స్ ఇంకెప్పుడు ఆగుతాయో?

ఇటీవలే సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన గుంటూరు కారం మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసింది.

By:  Tupaki Desk   |   14 Jan 2024 8:57 AM GMT
మీనాక్షి.. మీమ్స్ ఇంకెప్పుడు ఆగుతాయో?
X

ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఆ తర్వాత టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ సరసన ఖిలాడీలో నటించినా.. హిట్ సాధించలేకపోయింది. యంగ్ హీరో అడవి శేష్ హిట్-2 మూవీతో లైమ్ లైట్ లోకి వచ్చింది. కానీ అనుకున్నంత అవకాశాలు దక్కించుకోలేకపోయంది.

సోషల్ మీడియాలో మాత్రం తన ఫ్యాన్స్ తో మాత్రం డైలీ టచ్ లో ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త ఫొటోస్ ను షేర్ చేస్తుంటుంది. ఇటీవలే సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన గుంటూరు కారం మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసింది. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి తన వైపు తిప్పుకుంది. కానీ ఆమె ఫస్ట్ లుక్ లేట్ గా విడుదల చేయడంతో అసలు ఆమె సినిమాలో ఉందో లేదోనని అంతా అనుమానం వ్యక్తం చేశారు.

కానీ సినిమా రిలీజ్ కు కొన్ని రోజుల ముందు మేకర్స్ ఆమె లుక్ ను విడుదల చేశారు. లంగా వోణీ వేసుకుని.. మహేశ్ పై చేతులు వేసి ఉన్న పిక్ ను షేర్ చేశారు. ఆ పోస్టర్ లో మీనాక్షి మసాజ్ చేస్తున్నట్లు ఉండడంతో.. ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ పై ఫుల్ ట్రోల్స్ వచ్చాయి. అయితే మూవీలో మహేశ్ మరదలుగా నటించిన మీనాక్షి పాత్రను సినిమాలో చూసి ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

సినిమా మొత్తం ఆమె టీ, కాఫీతోపాటు ఆమ్లెట్లు అందించిందని.. మీనాక్షిది పనిమనిషి పాత్రలా ఉందని ఫ్యాన్స్ త్రివిక్రమ్ పై మండిపడుతున్నారు. మహేశ్ కు వైన్ వేసి ఇవ్వడానికే ఆమె పరిమితమైందని కామెంట్లు చేస్తున్నారు. మొత్తం మూవీలో ఆమెకు సరైన ఒక్క డైలాగ్ లేదని అంటున్నారు.

తన సినిమాల్లో రెండో హీరోయిన్ కు పెద్దగా స్కోప్ ఇవ్వని త్రివిక్రమ్.. మరోసారి అదే రిపీట్ చేశారని చెబుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో మీమ్స్ అస్సలు ఆగట్లేదు. ఒక్కడ చూసినా ఈ టాపిక్ పైనే మీమ్స్ కనిపిస్తున్నాయి. అందం, టాలెంట్ ఉన్న మీనాక్షి చౌదరికి అలాంటి పాత్ర ఇవ్వడం త్రివిక్రమ్ కు తగదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

నిజానికి ఆ రోల్.. శ్రీలీల చేయాల్సిందట. కానీ పూజాహెగ్డే తప్పుకున్నాక.. మెయిన్ హీరోయిన్ గా శ్రీలీల ప్రమోషన్ కొట్టింది. దీంతో మీనాక్షిని సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నారు. ఒకవేళ.. పూజాహెగ్డీ లెఫ్ట్ అవ్వకపోతే.. శ్రీలీల ఆ పనిమనిషి క్యారెక్టర్ చేసేదా అని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు త్రివిక్రమ్.. ఆ రోల్ ను మార్చేసేవారని అంటున్నారు. ఇప్పుడు మీనాక్షి రోల్ పై ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.