Begin typing your search above and press return to search.

ఈమె టైం నడుస్తుంది ఇప్పుడు !

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు సినిమా లో నటించే అవకాశం దక్కించుకున్న మీనాక్షి చౌదరికి మరో వైపు తమిళ్ సూపర్ స్టార్ విజయ్ సినిమాలో కూడా నటించే అవకాశం దక్కింది.

By:  Tupaki Desk   |   2 Oct 2023 3:56 AM GMT
ఈమె టైం నడుస్తుంది ఇప్పుడు !
X

ఇచ్చట వాహనాలు నిలుపరాదు సినిమా తో టాలీవుడ్ లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి. ఈ అమ్మడు కెరీర్‌ ఆరంభం లో చిన్న సినిమా లు.. పెద్దగా ప్రాముఖ్యత లేని పాత్రలు చేస్తూ ఉండటంతో ఈమె ఇండస్ట్రీ లో ఎంత కాలం ఉంటుందో అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. మీనాక్షి చౌదరి లక్ అనూహ్యంగా మారింది.

మహేష్ బాబు కు జోడీగా గుంటూరు కారం సినిమా లో నటించే అవకాశం దక్కింది. ఆ సినిమా లో మీనాక్షి కి దక్కింది సెకండ్‌ హీరోయిన్‌ పాత్ర అయినా కూడా ఇతర ఆఫర్లు రావడానికి ఆ సినిమా చాలా ఉపయోగపడింది అనడంలో సందేహం లేదు. తెలుగు లో ఇప్పటికే రెండు మూడు సినిమాలకు కమిట్ అయిన మీనాక్షి తమిళ్ లో కూడా జోరు కంటిన్యూ చేస్తోంది.

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు సినిమా లో నటించే అవకాశం దక్కించుకున్న మీనాక్షి చౌదరికి మరో వైపు తమిళ్ సూపర్ స్టార్ విజయ్ సినిమాలో కూడా నటించే అవకాశం దక్కింది. విజయ్‌ 68 లో మీనాక్షి చౌదరి కి ఇద్దరు హీరోయిన్స్ లో ఒక హీరోయిన్ గా నటించే అవకాశం లభించింది అంటూ తమిళ్ మీడియా సర్కిల్స్ నుంచి సమాచారం అందుతోంది.

మహేష్ బాబు మూవీ లో నటించడం వల్లే మీనాక్షికి ఇంతగా ఆఫర్లు వస్తున్నాయి అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. త్రివిక్రమ్‌ ఏరి కోరి మరీ మీనాక్షి చౌదరిని గుంటూరు కారం సినిమా కోసం తీసుకోవడం జరిగింది. అందుకే అందరి దృష్టిని మీనాక్షి ఆకర్షిస్తోంది.

రాబోయే రెండు మూడు ఏళ్లలో దాదాపు అందరు యంగ్‌ స్టార్‌ హీరోలను చుట్టేసేంత బిజీగా మీనాక్షి మారే అవకాశాలు ఉన్నాయి అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు కారం మరియు విజయ్ 68 సినిమా లు హిట్ అయ్యి ఆ సినిమా ల్లో ఈమె పాత్ర లకు మంచి గుర్తింపు వస్తే ఈమెను ఆపడం ఏ ఒక్కరి వల్ల కాదు.