Begin typing your search above and press return to search.

మీనాక్షి మరో జబర్దస్త్ ఛాన్స్..?

చిరు నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ విశ్వంభర సినిమాలో మీనాక్షి ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుండగా లేటేస్ట్ గా అమ్మడికి మరో లక్కీ ఛాన్స్ వచ్చిందని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   2 March 2024 4:30 PM GMT
మీనాక్షి మరో జబర్దస్త్ ఛాన్స్..?
X

సినీ పరిశ్రమలో ఏ హీరోయిన్ కు ఎంత క్రేజ్ వస్తుందో.. ఏ హీరోయిన్ ఎందుకు ఫేడవుట్ అవుతుందో చెప్పడం కష్టం. కొందరు టాలెంట్ తో మెప్పిస్తూ ప్రేక్షకుల మనసులు గెలుస్తుంటే.. మరికొందరు టాలెంట్ ఉన్నా కూడా అదృష్టం కలిసి రాక అలా వెనకపడుతుంటారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ అంతా కూడా అందం అభినయం రెండిటిలో తమ టాలెంట్ చూపిస్తున్నారు. వారిలో కాస్త స్పెషల్ గా అనిపించిన వారికి వరుస అవకాశాలు వస్తున్నాయి. అలాంటి వారిలో ఒకరిగా పేరు తెచ్చుకుంది ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి.

సుశాంత్ నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మీనాక్షి ఆ సినిమాతో ఆడియన్స్ ని అలరించింది. ఆ తర్వాత ఖిలాడి, హిట్ 2 సినిమాల్లో నటించింది. సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారంలో మహేష్ మరదలిగా మెప్పించింది మీనాక్షి. గుంటూరు కారంలో ఆమె చేసిన పాత్ర వల్ల ఆమె ఫ్యాన్స్ కాస్త నొచ్చుకున్నా ఆ సినిమాలో నటించడం వల్ల మెగాస్టార్ విశ్వంభరలో ఛాన్స్ అందుకుంది.

చిరు నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ విశ్వంభర సినిమాలో మీనాక్షి ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుండగా లేటేస్ట్ గా అమ్మడికి మరో లక్కీ ఛాన్స్ వచ్చిందని తెలుస్తుంది. విక్టరీ వెంకటేష్ అనీల్ రావిపుడి కాంబోలో రాబోతున్న సినిమాలో మొన్నటిదాకా త్రిష హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు రాగా లేటెస్ట్ గా ఈ సినిమాలో మీనాక్షి చౌదరికి ఛాన్స్ ఇచ్చారని తెలుస్తుంది. ఒకప్పుడు హీరోయిన్స్ సీనియర్ స్టార్ సినిమాల్లో నటించడానికి కాస్త ఆలోచించారు కానీ ఇప్పుడు అలా కాకుండా వచ్చిన ప్రతి ఛాన్స్ చేస్తూ వస్తున్నారు.

కింగ్ నాగార్జున నటించిన నా సామిరంగ సినిమాలో ఎలాగైతే ఆషిక రంగనాథ్ నటించి మెప్పించిందో ఇప్పుడు వెంకటేష్ సినిమాకు కూడా మీనాక్షి ఓకే చెప్పింది. అనీల్ రావిపుడి వెంకటేష్ సూపర్ హిట్ కాంబో హ్యాట్రిక్ సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ లో మీనాక్షి చౌదరి నటించడం ఆమె కెరీర్ కు మంచి బూస్టింగ్ ఇస్తుందని చెప్పొచ్చు. ఈ సినిమాతో పాటుగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మట్కా సినిమాలో కూడా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా చేస్తుంది. వరుస భారీ సినిమాలతో మీనాక్షి కెరీర్ స్ట్రాంగ్ చేసుకుంటుందని చెప్పొచ్చు.