Begin typing your search above and press return to search.

ఆమెను తక్కువ అంచనా వేస్తున్నారు.. కానీ..!

ఏది ఏమైనా యువ హీరోయిన్స్ లో చిన్నగా తన మార్క్ చాటుతూ ఆడియన్స్ మనసులు గెలిచే ప్రయత్నం చేస్తుంది మీనాక్షి చౌదరి.

By:  Tupaki Desk   |   31 March 2024 4:39 AM GMT
ఆమెను తక్కువ అంచనా వేస్తున్నారు.. కానీ..!
X

సుశాంత్ నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మీనాక్షి చౌదరి వరుస సినిమాలతో మెప్పిస్తూ వస్తుంది. మహేష్ త్రివిక్రం కాంబోలో వచ్చిన గుంటూరు కారం సినిమాలో మీనాక్షి మహేష్ మరదలి పాత్రలో నటించడం బాగానే ఉన్నా ఆమెకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ లేకపోవడం ఆమె ఫ్యాన్స్ ని హర్ట్ అయ్యేలా చేసింది. గుంటూరు కారం లో ఆ చిన్న పాత్రకు మీనాక్షి ఎలా ఒప్పుకుందని అనుకున్నారు. కానీ మీనాక్షి ప్లాన్ వేరే ఉందని టాక్.

స్టార్ సినిమాల్లో చిన్న పాత్ర అయినా సరే ఆ లెక్క వేరేలా ఉంటుంది. అయితే గుంటూరు కారం లో తను చేసిన పాత్ర వల్లే అమ్మడికి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఆల్రెడీ కోలీవుడ్ లో దళపతి విజయ్ సరసన G.O.A.T సినిమాలో నటిస్తుంది అమ్మడు. విజయ్ లాంటి స్టార్ తో ఛాన్స్ అంటే అది మామూలు విషయం కాదు. ఇక ఈ సినిమాతో పాటుగా తెలుగులో వరుణ్ తేజ్ తో మట్కా, దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్, విశ్వక్ సేన్ తో మెకానిక్ రాకీ సినిమాలు చేస్తుంది అమ్మడు.

విజయ్ G.O.A.Tలో అమ్మడి పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని టాక్. ఆ రోల్ కోసమే తను బాక్సింగ్ కూడా నేర్చుకున్నా అని చెప్పుకొచ్చింది మీనాక్షి. ఏది ఏమైనా యువ హీరోయిన్స్ లో చిన్నగా తన మార్క్ చాటుతూ ఆడియన్స్ మనసులు గెలిచే ప్రయత్నం చేస్తుంది మీనాక్షి చౌదరి. సినిమాలే కాదు అమ్మడు సోషల్ మీడియా లో క్రేజ్ కూడా అదిరిపోతుంది. మీనాక్షి ఫోటో షూట్స్ షేర్ చేస్తే చాలు క్షణాల్లో అవి వైరల్ అవుతుంటాయి. చూస్తుంటే సౌత్ లో మీనాక్షి స్టార్ క్రేజ్ తెచ్చుకునే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయని అనిపిస్తుంది.

సెట్స్ మీద ఉన్న సినిమాలన్నీ కూడా మీనాక్షి రేంజ్ పెంచే సినిమాలనే చెప్పొచ్చు. పాన్ ఇండియా సినిమా మట్కాతో పాటుగా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తో చేస్తున్న మెకానిక్ రాకీ కూడా క్రేజీ ప్రాజెక్ట్ గా వస్తుంది. ఇక లక్కీ భాస్కర్ సినిమాలో కూడా మీనాక్షి రోల్ అదిరిపోతుందని అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో కూడా మీనాక్షి దేవకన్య పాత్రలో నటిస్తుందని అంటున్నారు. చిరు సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్న అమ్మడు ఆ సినిమా తో కూడా సూపర్ పాపులర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాల తర్వాత మీనాక్షి రేంజ్ కచ్చితంగా మారబోతుందని అర్థమవుతుంది.