Begin typing your search above and press return to search.

ఆ భామ సైలెంట్ కిల్ల‌ర్ లా ఉందే!

సైలెంట్ గా వ‌చ్చి వైలెంట్ గా మార‌డం కొంద‌రి భామ‌ల‌కే చెల్లింది. శ్రీలీల‌..మీనాక్షి చౌద‌రి ఆ కోవ‌కు చెందిన వారే

By:  Tupaki Desk   |   7 April 2024 12:30 PM GMT
ఆ భామ సైలెంట్ కిల్ల‌ర్ లా ఉందే!
X

సైలెంట్ గా వ‌చ్చి వైలెంట్ గా మార‌డం కొంద‌రి భామ‌ల‌కే చెల్లింది. శ్రీలీల‌..మీనాక్షి చౌద‌రి ఆ కోవ‌కు చెందిన వారే. అందులో మీనాక్షి చౌద‌రి సంథింగ్ స్పెష‌ల్ అనాలి. 'ఇచ‌ట వాహ‌నములు' నిలుప‌రాదు చిత్రంతో ప‌రిచ‌య‌మైన మీనాక్షీ జ‌ర్నీ ఎలా ట‌ర్న్ అయిందే క‌ళ్ల ముందు క‌నిపిస్తూనే ఉంది. డెబ్యూ అనంత‌రం అమ్మ‌డు 'ఖిలాడీ'లో ర‌వితేజ‌తో న‌టించింది. ఆ వెంట‌నే అడ‌వి శేషు స‌ర‌స‌న న‌టించిన 'హిట్ ది సెకెండ్ కేస్' తో మ‌రో విజ‌యం ఖాతాలో వేసుకుంది. ఈ రెండు విజ‌యాల‌తో నేరుగా మ‌హేష్ స‌ర‌స‌న 'గుంటూరు కారం'లో ఛాన్స్ అందుకుంది.

ఈ సినిమాతో అమ్మ‌డు మాస్ ఆడియ‌న్స్ కి రీచ్ అయింది. మ‌ధ్య‌లో కొన్ని కోలీవుడ్ సినిమాలు చేసింది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ లైనప్ చూస్తే స్ట‌న్ అవ్వాల్సిందే. వ‌రుణ్ తేజ్ తో మ‌ట్కాలో న‌టిస్తోంది. ఇది పాన్ ఇండియా చిత్రం. అలాగే మాలీవుడ్ స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్ కి జోడీగా 'ల‌క్కీ భాస్క‌ర్' లో న‌టిస్తోంది. ఈ రెండు చిత్రాల్ని మించి కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ కి జంట‌గా 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' లోనూ న‌టిస్తోంది. #వి.ఎస్ 10 అనే మ‌రో చిత్రంలో ఛాన్స్ అందుకుంది.

ఇలా సినిమాల్లో న‌టించ‌డం అంటే చిన్న విష‌యం కాదుగా. సైలెంట్ గా ఇలా అవ‌కాశాల‌తో అభిమానుల్ని స‌ర్ ప్రైజ్ చేయ‌డం మీనాక్షి కే చెల్లింది. ఈ మ‌ధ్య కాలంలో ఏ యువ న‌టి ఇన్ని అవ‌కాశాల‌తో బిజీగా లేదు. ఇన్ని సినిమాలు చేస్తున్నాను అన్న సంగ‌తి మీనాక్షి రివీల్ చేసింది లేదు. సైలెంట్ గా ఛాన్సులంద‌కుని నేరుగా థియేట‌ర్లోనే అభిమానుల్ని అల‌రిస్తాను చూసి త‌రించండి అంటూ చెప్ప‌క‌నే చెప్పేసింది. మ‌రో న‌టి అయితే బోలెడంత ప్ర‌చారం చేసుకునేది. చేతిలో అవ‌కాశాలున్నా లేక‌పోయినా కొత్త ప్రాజెక్ట్ లు వ‌స్తున్నాయి. వాటికి సైన్ చేయాలి.

కొన్ని చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయ‌ని క‌హానీలు చెప్పే భామ‌లెంతో మంది ఉన్నారు. కానీ మీనాక్షి ఆ టైపు కాదు. మాట్లాడాల్సింది తాను త‌న సినిమాలు..త‌న ప‌నిత‌నం అంటూ సైలెంట్ గా ట్విస్టులిస్తుంది. ఈ సినిమాల‌న్నీ విజ‌యం సాధిస్తే అమ్మ‌డి స్టార్ డ‌మ్ మామూలుగా ఉండ‌దు. మీనాక్షి విష‌యంలో త్రివిక్ర‌మ్ గెస్సింగ్ వంద‌శాతం నిజ‌మైంది. ఇచట వాహ‌న‌ములు ప్ర‌చారం స‌మ‌యంలో మీనాక్షి కి టాలీవుడ్ లో మంచి భ‌విష్య‌త్ ఉంటుంద‌ని ముందే గెస్ చేసారు. ఇప్పుడాయ‌న చెప్పిన‌ట్లే జ‌రుగుతుంది క‌దా.