Begin typing your search above and press return to search.

ఇంత టాలెంట్ అమ్మాయికి పని మనిషి రోల్‌ ఏంటి..?

ఫెమినా మిస్ ఇండియాగా నిలిచిన మీనాక్షి చౌదరి తెలుగు ప్రేక్షకులకు ఇచ్చట వాహనాలు నిలుపరాదు సినిమాతో పరిచయం అయ్యింది

By:  Tupaki Desk   |   12 Feb 2024 7:49 AM GMT
ఇంత టాలెంట్ అమ్మాయికి పని మనిషి రోల్‌ ఏంటి..?
X

ఫెమినా మిస్ ఇండియాగా నిలిచిన మీనాక్షి చౌదరి తెలుగు ప్రేక్షకులకు ఇచ్చట వాహనాలు నిలుపరాదు సినిమాతో పరిచయం అయ్యింది. ఆ సినిమా కమర్షియల్‌ గా నిరాశ పరిచినా కూడా మీనాక్షి చౌదరికి మంచి పేరు దక్కింది. ఆ సినిమా తర్వాత ఖిలాడీ మరియు హిట్ సినిమాల్లో నటించిన విషయం తెల్సిందే.

మొన్న సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడికి చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఒక ఇంటర్వ్యూలో మీనాక్షి చౌదరి మాట్లాడుతూ తన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తో పాటు, తన యొక్క ప్రతిభ గురించి చెప్పుకొచ్చింది.

తాను ఒక హీరోయిన్‌ ని మాత్రమే కాదని, తాను ఒక సర్టిఫైడ్ డెంటిస్ట్‌. నేషనల్‌ డెంటల్ కాలేజ్‌ అండ్ హాస్పిటల్‌ లో డెంటల్ కోర్స్ ను పూర్తి చేసింది. అంతే కాకుండా ఈ అమ్మడు స్టేట్ లెవల్‌ స్విమ్మింగ్ కాంపిటీషన్ పాల్గొని విజయాన్ని సొంతం చేసుకుందట. స్టేట్ లెవల్ బ్యాడ్మింటన్ ప్లేయర్‌ ను అని కూడా ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.

ఇంత టాలెంటెడ్ అమ్మాయికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరైన గుర్తింపు మరియు గౌరవం దక్కడం లేదు అంటూ చాలా మంది పెదవి విరుస్తున్నారు. మొన్న మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో మీనాక్షికి మంచి రోల్‌ ఉంటుందని అంతా ఆశించారు. కానీ ఆ సినిమాలో మీనాక్షికి పెద్దగా ప్రాముఖ్యత లేని మరదలు రోల్ వచ్చింది హీరో కి హెల్ప్ చేసే పనిమనిషి లాంటి రోల్‌ దక్కింది అని ఆమె ఫాన్స్ ఫీల్ అవ్వుతున్నారు .

తాజా వీడియో వైరల్‌ అవ్వడంతో చాలా మంది అంత టాలెంటెడ్‌ అమ్మాయికి పని మనిషి లాంటి రోల్‌ ఎలా ఇచ్చారు గురూజీ అంటూ త్రివిక్రమ్‌ ను ప్రశ్నిస్తూ కొందరు మీమ్స్ ను కూడా క్రియేట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం సూపర్‌ స్టార్‌ విజయ్‌ సినిమాలో నటిస్తున్న మీనాక్షి టాలీవుడ్‌ లో కూడా రెండు సినిమాలు చేస్తోంది. వాటితో అయినా ఈ అమ్మడు స్టార్‌ హీరోయిన్‌ల జాబితాలో చేరుతుందేమో చూడాలి.