Begin typing your search above and press return to search.

గుంటూరు కారం.. ఎప్పటికీ మర్చిపోలేను: మీనాక్షి చౌదరి

మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ఈవెంట్ ను గుంటూరు లో గ్రాండ్ గా నిర్వహించారు

By:  Tupaki Desk   |   9 Jan 2024 5:43 PM GMT
గుంటూరు కారం.. ఎప్పటికీ మర్చిపోలేను: మీనాక్షి చౌదరి
X

మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ఈవెంట్ ను గుంటూరు లో గ్రాండ్ గా నిర్వహించారు. ఇక వేడుకలో పాల్గొన్న మీనాక్షి చౌదరి తన మాటలతో ఎంఘగానో ఆకట్టుకుంది. మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. ముందుగా త్రివిక్రమ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఆయనతో వర్క్ చేయాలని కోరుకున్నాను. అది ఈరోజు నిజమైనందుకు కూడా చాలా సంతోషిస్తున్నాను.

త్రివిక్రమ్ గారిని జనాలు అందరూ కూడా గురూజీ అని ఎందుకు పిలుస్తారో నాకు ఆ తరువాత అర్థం అయింది. అలాగే నిర్మాతలు వంశీగారు చిన్న బాబు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారు నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఈ సినిమాలో నన్ను ఒక భాగం చేసుకున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

ఇక ఈ సినిమాలో డాన్స్ తో అదరగొట్టిన హీరోయిన్ శ్రీలీల పెర్ఫెమెన్స్ మామూలుగా లేదు. ఇలాంటి యాక్టర్తో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో నాకు అవకాశం వచ్చింది అనగానే షాక్ అయ్యాను. ఒక ఫోన్ కాల్ లో మీరు త్రివిక్రమ్ సినిమాలో నటిస్తారా అని అడగగానే.. ఒక డైలాగ్ గుర్తుకు వచ్చింది. నా రెండు చేతులు జేబులో పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళిపోతున్నానో కూడా నాకు తెలియడం లేదు అనే డైలాగ్ నాకు గుర్తుకు వచ్చింది.

అంతగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక గుంటూరు కారం మొదటిరోజు సెట్లో మహేష్ బాబు గారిని మొదటిసారి చూసినప్పుడు చాలా నర్వస్ గా ఫీల్ అయ్యాను. కానీ ఆయన కూడా చాలా బాగా సపోర్ట్ చేసిన విధానంతో నాకు చాలా బాగా నచ్చింది. మహేష్ బాబు గారు మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్. అలాగే ఆయన ఒక పర్ఫెక్ట్ జెంటిల్మెన్. ఆయనతో వర్క్ చేయడం నిజంగా నేను ఎప్పటికీ మర్చిపోలేను. అభిమానులందరూ కూడా ఈరోజు కోసమే ఎదురుచూస్తున్నారు అని అనిపిస్తోంది. ఇక ఈ నెల 12వ తేదీన మీ అందరికీ ఇష్టమైన మహేష్ బాబు మాస్ క్యారెక్టర్ తో గుంటూరు కారం సినిమాతో సందడి చేయబోతున్నారు. థియేటర్లలో కలుద్దాం.. అని మీనాక్షి చౌదరి మాట్లాడారు.