Begin typing your search above and press return to search.

ఎక్కువ సినిమాలు చేయాలని లేదు

సూపర్ స్టార్‌ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో అనూహ్యంగా చోటు దక్కించుకున్న మీనాక్షి

By:  Tupaki Desk   |   26 July 2023 6:11 AM GMT
ఎక్కువ సినిమాలు చేయాలని లేదు
X

సూపర్ స్టార్‌ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో అనూహ్యంగా చోటు దక్కించుకున్న మీనాక్షి చౌదరి ప్రస్తుతం టాలీవుడ్‌ లో మోస్ట్‌ క్రేజీ బ్యూటీస్ సరసన చోటు సంపాదించింది. హీరోయిన్‌ గా ఈ అమ్మడి యొక్క జోరు మామూలుగా లేదు. ఇచ్చట వాహనాలు నిలుపరాదు సినిమా తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అమ్మడు హిట్ 2 తో హిట్ సొంతం చేసుకుంది.

హిట్ 2 తర్వాత.. అంతకు ముందు కూడా తన వద్దకు చాలా సినిమా ఆఫర్లు వచ్చాయట. కానీ కథలో ప్రాముఖ్యత లేని పాత్రలు చేయడం... నటనకు ఆస్కారం లేని పాత్రలు చేయడం అస్సలు ఇష్టం లేదట. అందుకే కొన్ని సినిమాలను కాదనుకున్నట్లుగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఎక్కువ సినిమాలు చేయాలని తనకు లేదని.. ప్రేక్షకుల మనసుకు నచ్చే సినిమాలు చేయాలి అనేది తన కోరిక.

గుంటూరు కారం సినిమా లో తనకు మంచి గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నట్లుగా పేర్కొంది. బోల్డ్ పాత్రల్లో నటించేందుకు ఆసక్తి చూపించని ఈ అమ్మడు నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో నటించేందుకు సిద్ధం అన్నట్లుగా తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మహేష్ బాబు సినిమాలో ఈమె పాత్రకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో చూడాలి.

ప్రస్తుతానికి మహేష్ బాబు సినిమా మాత్రమే చేస్తుంది. ఒకటి రెండు సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుందని... చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. మొత్తానికి ఈ అమ్మడు గుంటూరు కారం సినిమా తర్వాత వరుస సినిమాలతో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈమె మాత్రం పాత్ర కు ప్రాముఖ్యత... కథలో ప్రాముఖ్యత అంటున్న కారణంగా ఎంత వరకు అవకాశాలు వస్తాయో చూడాలి.