Begin typing your search above and press return to search.

అగ్ర హీరోల‌కు అడుగు దూరంలో మీనాక్షి బ్యూటీ!

కానీ ఆ త‌ర్వాత అవ‌కాశాలు వెంట‌నే రాలేదు

By:  Tupaki Desk   |   21 July 2023 10:52 AM GMT
అగ్ర హీరోల‌కు అడుగు దూరంలో మీనాక్షి బ్యూటీ!
X

'ఇచ‌ట వాహ‌నములు నిలుప‌రాదు' సినిమాతో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన మీనాక్షి చౌద‌రి సుపరిచిత‌మే. తొలి సినిమాతోనే అమ్మ‌డు త్రివిక్ర‌మ్ లాంటి సీనియ‌ర్ ద‌ర్శ‌కుడి ప్ర‌శంస‌లందుకుంది. ఆ సినిమ‌లో సొగ‌స‌రి న‌ట‌న‌కి మంచి మార్కులు ప‌డ్డాయి. న‌టిగా ప‌రిశ్ర‌మ‌కి ప‌నికొస్తుంద‌ని నిరూపించుకుంది. దీంతో ఆ వెంట‌నే ర‌వితేజ 'ఖిలాడీ'లో అవ‌కాశం క‌ల్పించాడు. కానీ ఆ సినిమా ప‌రాజ‌యం చెందిన వెంట‌నే 'హిట్ -2' తో మ‌రో స‌క్సెస్ ని ఖాతాలో వేసుకుంది.

కానీ ఆ త‌ర్వాత అవ‌కాశాలు వెంట‌నే రాలేదు. కొన్ని నెల‌లు పాటు వెయిట్ చేయాల్సి వ‌చ్చింది. మ‌రి తాజా ప‌రిస్థితి ఏంటి? అంటే మీనాక్షి కెరీర్ స్పీడప్ అవుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇటీవ‌లే సూప‌ర్ స్టార్ మ‌హేష్ స‌ర‌స‌న 'గుంటూరు కారం' లో సెకెండ్ లీడ్ కి ఎంపికైంది.

త్రివిక్ర‌మ్ ఏరికోరి మ‌రీ ఎంపిక చేసాడు. పూజాహెగ్డే ఎగ్జిట్ అవ్వ‌డంతో మీనాక్షికి వ‌చ్చిన అవ‌కాశ‌మిది. అంత‌కు ముందు మ‌రో రెండు ప్రాజెక్ట్ ల‌కు సైన్ చేసింది. అయితే 'గుంటూరు కారం 'ఛాన్స్ అమ్మ‌డికి లైఫ్ చేంజింగ్ ఆఫ‌ర్ అనే చెప్పాలి.

ఈ సినిమా హిట్ అయితే గ‌నుక స్టార్ హీరోల‌కు సెకెండ్ హీరోయిన్ ఆప్ష‌న్ గా మారిపోతుంద‌ని చెప్పొచ్చు. ఇప్పుడెక్కువ‌గా మేక‌ర్స్ గ్లామ‌ర్ పాత్ర‌ల‌క‌న్నా బెస్ట పెర్పార్మెర్స్ ఎవ‌రు? ఉన్నార‌ని వెతుకుతున్నారు.

ఈ నేప‌థ్యంలో ముంబై భామ‌ల‌ కంటే నేచుర‌ల్ బ్యూటీలైన సౌత్ భామ‌ల‌వైపు ఎక్కువగా చూస్తున్నారు. న‌టిగా మీనాక్షిపై పాజిటివ్ ఇంప్రెషన్ ప‌డిన నేప‌థ్యంలో మేక‌ర్స్ అమెకి ఎక్కువ‌గా ఛాన్సులు ఇవ్వొచ్చ‌ని తెలుస్తోంది.

అందులోనూ త్రివిక్ర‌మ్ మెచ్చాడంటే త‌న సినిమాల్లోనే ఏదో క్యారెక్టర్ ఇస్తుంటారు. పూజాహెగ్డే ..స‌మంత‌లా ఎక్కువ‌గా రిపీట్ చేయ‌డానికి ఛాన్స్ ఉంటుంది. త‌మ‌న్నా..కాజ‌ల్ లాంటి భామ‌లు ఇప్ప‌టికే క‌రుమ‌రుగ‌వుతోన్న నేప‌థ్యంలో మీనాక్షి లాంటి వారికి ప‌రిశ్ర‌మ పెద్ద పీట వేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.