Begin typing your search above and press return to search.

గుంటూరు కారం : ఆ విషయం చెప్పి 'నో లీక్స్‌' అంటుంది

తాజాగా ఒక సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మీనాక్షి చౌదరి మాట్లాడుతూ గుంటూరు కారం సినిమా లో నటిస్తున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొంది

By:  Tupaki Desk   |   17 July 2023 5:05 AM GMT
గుంటూరు కారం : ఆ విషయం చెప్పి నో లీక్స్‌ అంటుంది
X

సూపర్ స్టార్‌ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వం లో రూపొందుతున్న గుంటూరు కారం సినిమా షూటింగ్‌ కొత్త షెడ్యూల్ ప్రారంభం అయ్యింది. వీకెండ్స్ కూడా వదిలి పెట్టకుండా సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఈ సినిమా హీరోయిన్స్ విషయమై చాలా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెల్సిందే.

గుంటూరు కారం లో అందరి కంటే ముందు హీరోయిన్ ను కన్ఫర్మ్‌ చేసిన త్రివిక్రమ్‌ తన సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తూ పూజా హెగ్డే తో వర్క్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. షూటింగ్‌ ప్రారంభం అయిన తర్వాత హీరోయిన్ విషయంలో కొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. పూజా హెగ్డే మెయిన్‌ హీరోయిన్ గా శ్రీలీల సెకండ్ హీరోయిన్‌ గా ఉండగా.. పూజా హెగ్డే ను తొలగించి శ్రీలీలను మెయిన్ హీరోయిన్‌ గా ఎంపిక చేయడం జరిగింది.

సెకండ్‌ హీరోయిన్ పాత్రకు గాను ఖిలాడీ బ్యూటీ మీనాక్షి చౌదరిని ఎంపిక చేయడం జరిగింది. ఈ విషయాన్ని యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. అంతే కాకుండా తాజాగా ఒక సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మీనాక్షి చౌదరి మాట్లాడుతూ గుంటూరు కారం సినిమా లో నటిస్తున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొంది.

సినిమా లో మీనాక్షి నటిస్తున్న విషయాన్ని యూనిట్‌ సభ్యులు సీక్రెట్ గా ఉంచారు. కానీ ఆమె మాత్రం తేల్చి చెప్పింది. సినిమా విషయాలను రహస్యంగా ఉంచాల్సిన హీరోయిన్‌ తాను నటిస్తున్నట్లుగా చెప్పి.. ఆ పై నో లీక్స్ అందట. గుంటూరు కారం గురించి విషయాలు చెప్పండి అంటూ మీడియా వారు అడిగిన సమయంలో నో లీక్స్ అంటూ సమాధానం ఇచ్చింది.

ఖిలాడీ.. హిట్‌ 2 సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపును దక్కించుకున్న ఈ అమ్మడు గుంటూరు కారం సినిమా తర్వాత టాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మహేష్ బాబు వంటి సూపర్ స్టార్‌ సినిమా లో సెకండ్‌ హీరోయిన్ కాదు సెట్‌ ప్రాపర్టీ గా ఉన్నా కూడా మంచి గుర్తింపు లభిస్తుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే గుంటూరు కారం తర్వాత కచ్చితంగా మీనాక్షి కి తెలుగు లో మంచి ఆఫర్లు రావడం ఖాయం.