Begin typing your search above and press return to search.

ద‌ర్శ‌కుడి పెళ్లి ప్ర‌పోజ‌ల్ తిర‌స్క‌రించింద‌ని..!

మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న 'ఆప‌ద్భాంద‌వుడు' చిత్రంలో న‌టించిన ఈ బ్యూటీ పేరు- మీనాక్షి శేషాద్రి. 90ల‌లో మీనాక్షి టాప్ హీరోయిన్.

By:  Tupaki Desk   |   1 April 2025 9:38 AM IST
ద‌ర్శ‌కుడి పెళ్లి ప్ర‌పోజ‌ల్ తిర‌స్క‌రించింద‌ని..!
X

శ్రీ‌దేవి, మాధురి, జ‌య‌ప్ర‌ద లాంటి అగ్ర‌ క‌థానాయిక‌ల‌కు ధీటైన న‌టిగా పేరు తెచ్చుకున్న ప్ర‌ముఖ హీరోయిన్.. త‌న‌ ద‌ర్శ‌కుడి పెళ్లి ప్ర‌పోజ‌ల్స్ కార‌ణంగా.. చాలా డిస్ట్ర‌బ్ అయ్యి, ఆ త‌ర్వాత భార‌త‌దేశం విడిచి విదేశాల‌కు వెళ్లిపోయింది. కేవ‌లం 32 వ‌య‌సులో ఉజ్వ‌ల‌మైన భ‌విష్య‌త్ ని వ‌దులుకుని ఇలాంటి త్యాగం చేయాల్సి వ‌చ్చింది. ఇంత‌కీ ఆ న‌టి ఎవ‌రో చెప్ప‌గ‌ల‌రా?


మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న 'ఆప‌ద్భాంద‌వుడు' చిత్రంలో న‌టించిన ఈ బ్యూటీ పేరు- మీనాక్షి శేషాద్రి. 90ల‌లో మీనాక్షి టాప్ హీరోయిన్. శ్రీ‌దేవి, మాధురి ధీక్షిత్, జ‌య‌ప్ర‌ద వంటి స్టార్ల‌కు ధీటుగా క‌థానాయిక‌గా రాణించింది. బాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ గా ఉండ‌గానే చిరంజీవి స‌ర‌స‌న ఆప‌ద్భాంద‌వుడులో న‌టించింది. అయితే ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌కుడి పెళ్లి ప్ర‌పోజ‌ల్ ని తిర‌స్క‌రించాక‌...ఇండ‌స్ట్రీలో తన స్థానం కోసం తీవ్రంగా పోరాడాల్సి వచ్చింది. చివరికి భారతదేశం విడిచిపెట్టి విదేశాల‌కు వెళ్లిపోయింది. చివ‌రికి న‌టిగా కెరీర్ ని వ‌దులుకుంది.

మీనాక్షి 1990లో `ఘాయల్` చిత్రం కోసం ద‌ర్శ‌కుడు రాజ్ కుమార్ సంతోషితో కలిసి పనిచేసింది. 1993లో `దామిని` కోసం తిరిగి కలిశారు. ఈసారి మీనాక్షి టైటిల్ రోల్‌ను పోషించ‌గా, రిషి కపూర్ , సన్నీ డియోల్‌ సహాయక పాత్రల్లో నటించాల్సి ఉంది. కానీ సినిమా ప్రారంభం అవుతుండగా రాజ్ కుమార్ సంతోషి మీనాక్షితో పెళ్లి ప్రతిపాదన తెచ్చాడు. కానీ మీనాక్షి నిరాకరించింది. ఆ తర్వాత మీనాక్షిని రాజ్ కుమార్ సంతోషి నిర‌భ్యంత‌రంగా రెండో ఆలోచ‌న లేకుండా సినిమా నుండి తొలగించారు. ఇది ప‌రిశ్ర‌మ‌కు షాకిచ్చింది.

అయితే ఇటీవ‌ల జూమ్ ఇంట‌ర్వ్యూలో నాటి సంఘ‌ట‌న గురించి మీనాక్షి శేషాది మాట్లాడారు. తాను అప్పుడు సైలెంట్ గా ఉన్నాన‌ని, నాటి కార్మిక చ‌ట్టాల కార‌ణంగా ఇలాంటి విష‌యాల్లో పోరాటం సంక్లిష్ఠ‌మైన‌ద‌ని మీనాక్షి వెల్ల‌డించింది. అయితే చివరికి ఆర్టిస్ట్స్ గిల్డ్, ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఇన్వాల్వ్ అయ్యి మీనాక్షికి మద్దతుగా నిలిచి `చట్టవిరుద్ధమైన తొలగింపు`ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. చివ‌రికి రాజ్ కుమార్ సంతోషి వెన‌క్కి త‌గ్గాడు.. దామినిలో మీనాక్షి న‌టించింది. ఆ సినిమా విడుద‌లై విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొంద‌డ‌మే గాక‌, క‌మ‌ర్షియ‌ల్ గా ఘ‌న‌విజయం సాధించింది. ఆ త‌ర్వాత కేవ‌లం మూడు చిత్రాల‌తో కెరీర్ ని ముగించి సినీప‌రిశ్ర‌మ‌కు చెంద‌ని వేరొక‌రిని పెళ్లాడింది.

`దామిని` మీనాక్షి కెరీర్‌లో అద్భుత‌ విజయాలలో ఒకటి. 1995లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ హరీష్ మైసూర్‌ను వివాహం చేసుకునే ముందు మరో మూడు చిత్రాల్లో మాత్రమే నటించింది. పెళ్లి తర్వాత మీనాక్షి న‌టించిన‌ ఒకే ఒక్క సినిమా విడుదలైంది.. అది 1996లో ఘాయల్. 32 సంవత్సరాల వయసులోనే మీనాక్షి సినిమాలకు స్వస్తి పలికింది. త‌న‌ భర్తతో క‌లిసి అమెరికాకు వెళ్లిపోయింది. అక్క‌డ ప్రస్తుతం తమ ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్నారు.