Begin typing your search above and press return to search.

బ్లాక్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాల మాయ

అందుకే ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సినీ సెలబ్రిటీలు కూడా కామెంట్స్ చేస్తూ మీనాక్షికి ఫుల్ మార్కులు వేస్తున్నారు.

By:  Tupaki Desk   |   26 July 2025 6:00 AM IST
బ్లాక్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాల మాయ
X

గ్లామరస్ లుక్‌లు ఆమెకు కొత్తకాదు కానీ, ఈసారి మాత్రం మీనాక్షి చౌదరి చూపిన అటిట్యూడ్ చూస్తే ఏవరికైనా వావ్ అనిపించకమానదు. బ్లాక్ షైనీ డ్రెస్‌లో ఆమె చేసిన ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కాస్త బోల్డ్‌గా కనిపించిన మీనాక్షి స్టైలింగ్‌లోని ఫినిషింగ్, హేర్ డూ, మేకప్ అన్నీ కూడా పర్ఫెక్ట్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఫ్రెంచ్ మ్యూజిక్‌కి స్టయిలిష్‌గా పోజులిచ్చిన ఈ ఫోటోలు యువతను ఆకర్షిస్తున్నాయి.

మెడ దగ్గర నుండి స్లీవ్‌కు లూప్ లా డిజైన్ చేసిన డ్రెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఆమె కళ్ల లుక్స్. కెమెరాకి ఆమె ఇచ్చిన లుక్స్‌లో కనిపించిన కాన్ఫిడెన్స్, ఫెమినిన్ గ్రేస్ అన్నీ కలిసి ఫోటోషూట్‌ను లెవెల్ మీదకు తీసుకెళ్లాయి. అందుకే ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సినీ సెలబ్రిటీలు కూడా కామెంట్స్ చేస్తూ మీనాక్షికి ఫుల్ మార్కులు వేస్తున్నారు.

కేవలం ఫోటోలు మాత్రమే కాదు, మీనాక్షి చౌదరి కెరీర్ కూడా ఇంప్రెసివ్‌గా కొనసాగుతోంది. మిస్ ఇండియా రన్నరప్‌గా గుర్తింపు పొందిన ఆమె, తన సినీ ప్రస్థానాన్ని ‘ఇచట వాహనములు నిలుపరాదు’ అనే చిత్రంతో ప్రారంభించారు. ఆ తరువాత ‘ఖిలాడి’, ‘హిట్ 2’, ‘గుంటూరు కారం’ వంటి సినిమాల్లో గ్లామరస్ పాత్రలతో ఆకట్టుకున్నారు. ఆమెకి త్వరలో విడుదల కాబోయే సినిమాలు కూడా ఓ కీలకమైన మైలురాయిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు అమ్మడికి మంచి విజయాన్ని ఇచ్చాయి. గ్లామర్‌తో పాటు పెర్ఫార్మెన్స్ పరంగా కూడా మెప్పించే రోల్స్‌ కోసం ప్రయత్నిస్తున్న ఆమెకు ఇది కచ్చితంగా ప్లస్ అవుతుంది. ఈ తరహా ఫోటోషూట్లు ఆమెకు యూత్‌లో క్రేజ్ పెంచడమే కాకుండా, దర్శకుల దృష్టిని కూడా ఆకర్షిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.