అప్పుడు మామ.. ఇప్పుడు అల్లుడు.. అమ్మడు సందడే సందడి!
ఇప్పుడు అల్లుడు సరసన నటిస్తోంది. మరో హిట్ కొట్టేందుకు సిద్ధమవుతోంది. ఆమె ఎవరో కాదు మీనాక్షీ చౌదరి.
By: Tupaki Desk | 17 April 2025 7:19 PM ISTమొన్న మామయ్యతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన ఆ హీరోయిన్.. ఇప్పుడు అల్లుడు సరసన నటిస్తోంది. మరో హిట్ కొట్టేందుకు సిద్ధమవుతోంది. ఆమె ఎవరో కాదు మీనాక్షీ చౌదరి. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 2025ను సక్సెస్ ఫుల్ గా స్టార్ట్ చేసిన అమ్మడు.. నాగచైతన్య అప్ కమింగ్ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
అయితే మామాఅల్లుళ్లతో వెంటవెంటనే స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోయిన్స్ లో మీనాక్షీ చౌదరి ఒకరు. అదే సమయంలో నాగచైతన్య రీసెంట్ గా తండేల్ తో ఎలాంటి హిట్ అందుకున్నారో అందరికీ తెలిసిందే. శ్రీకాకుళానికి చెందిన కొందరు మత్స్యకారుల నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా చందూ మొండేటి తెరకెక్కించిన ఆ మూవీతో రూ.100 కోట్ల విజయాన్ని సాధించారు.
దీంతో ఇప్పుడు చైతూ అప్ కమింగ్ ప్రాజెక్ట్ NC 24పై అందరి ఫోకస్ పడింది. కొంత కాలం క్రితం రిలీజ్ అయిన విరూపాక్షతో ప్రేక్షకులను మెప్పించిన యంగ్ డైరెక్టర్ కార్తీక్ దండుతో సినిమా చేయనున్నారు నాగ చైతన్య. ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడి ఉన్న మిస్టీక్ థ్రిల్లర్ గా.. గ్రాండ్ గా సినిమా రూపొందనున్నట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
సినిమాలో చైతన్య రెండు కోణాలు ఉన్న రోల్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఫుల్ గా మేకోవర్ చేసుకోనున్నారని సమాచారం. దీంతో కెరీర్ లో నెవ్వర్ బిఫోర్ పాత్రలో నటించనున్నారని వినికిడి. ఆయన సినీ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా కానుందని, గ్రాఫిక్స్ పనుల కోసమే బడ్జెట్ లోని ఎక్కువ భాగం ఖర్చు చేయనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది.
అయితే విరూపాక్షలో తన దర్శకత్వ ప్రతిభ అంటే ఏంటో చూపించిన కార్తీక్ వర్మ.. పౌరాణికాలను, సస్పెన్స్ మిళితం చేసే మరో ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ గా NC 24ను అందించాలనే ఆసక్తిగా ఉన్నారని సమాచారం. మొత్తానికి చైతూ NC 24పై ఇప్పటికే ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ తో మేకర్స్ సందడి చేయనున్నారని తెలుస్తోంది. దీంతో సినిమా కోసం అంతా వెయిట్ చేస్తున్నట్లు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
