Begin typing your search above and press return to search.

వీడియో : అందాల మీనూ యోగా డే స్పెషల్‌

మీనాక్షి చౌదరి యోగా చేస్తూ ఉన్న వీడియోతో పాటు, స్విమ్మింగ్‌ చేస్తూ ఉన్న వీడియోను షేర్‌ చేసింది.

By:  Tupaki Desk   |   21 Jun 2025 12:47 PM IST
వీడియో : అందాల మీనూ యోగా డే స్పెషల్‌
X

ఫెమినా మిస్‌ ఇండియా 2018 పోటీల్లో హర్యానా రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించి కిరీటాన్ని గెలుచుకున్న మీనాక్షి చౌదరి ఇప్పుడు సినిమాల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుంది. గత ఏడాది ఈమె నటించిన అర డజను సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మొదటగా వచ్చిన గుంటూరు కారం సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా కనిపించినప్పటికీ అందంగా కనిపించింది. అయితే ఆశించిన స్థాయిలో స్క్రీన్‌ ప్రజెన్స్ దక్కలేదు. పైగా సినిమా బాక్సాఫీస్‌ వద్ద నిరాశ పరచింది. కానీ గత ఏడాదిలో ఈమెకు దుల్కర్‌ సల్మాన్‌ తో కలిసి నటించిన లక్కీ భాస్కర్‌ సినిమా భారీ విజయాన్ని కట్టబెట్టింది. ఆ సినిమా తో కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లోనూ ఈమెకు గుర్తింపు లభించింది.

లక్కీ భాస్కర్‌ విజయం మట్కా, మెకానిక్ రాకీ సినిమాలు మీనాక్షి ని నిరాశకు గురి చేశాయి. అయితే లక్కీగా ఈమెకు ఈ ఏడాది ఆరంభంలో సూపర్‌ డూపర్‌ హిట్‌ దక్కింది. వెంకటేష్‌ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో మీనాక్షి పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఐశ్వర్య రాజేష్‌తో పోటీ పడి మరీ ఈ సినిమాలో ఆమె కనిపించింది. అందంతో పాటు అభినయంతో మెప్పించింది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ నటించేందుకు సిద్ధంగా ఉంది. ఇక సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. నేడు ఇంటర్నేషనల్‌ యోగా డే సందర్భంగా తన వీడియోను షేర్‌ చేసింది.

మీనాక్షి చౌదరి యోగా చేస్తూ ఉన్న వీడియోతో పాటు, స్విమ్మింగ్‌ చేస్తూ ఉన్న వీడియోను షేర్‌ చేసింది. వివిధ రకాల యోగ ఆసనాలను వేయడం ద్వారా యోగా డే సందర్భంగా చాలా మందికి యోగా గురించి మీనాక్షి చౌదరి చెప్పకనే చెప్పింది. యోగా వీడియోతో పాటు... నా ప్రతి సర్వ్, ప్రతి స్ట్రోక్, ప్రతి శ్వాస బ్యాలెన్స్ తో ప్రారంభమవుతుంది. నీటిలా ప్రవహించండి, గాలిలా కదలండి మరియు నిప్పులా మండండి!

ఆరోగ్యం మరియు సమతుల్యత ప్రయాణంలో మునిగిపోవడానికి యోగాను మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోండి. అందరికీ హ్యాపీ & హెల్తీ యోగా డే శుభాకాంక్షలు అంటూ ఇన్‌స్టాలో పేర్కొంది. ఎంతో మంది హీరోయిన్స్ యోగా డే వీడియోలు షేర్ చేసినా మీనూ మేడం యోగా డే స్పెషల్‌ వీడియో స్పెషల్‌గా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అందాల కిరీటంను దక్కించుకున్న తర్వాత మీనాక్షి చౌదరి 2019లో అప్‌స్టార్ట్స్‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఈమెకు ఇచట వాహనములు నిలుపరాదు సినిమాలో ఎంట్రీ లభించింది. ఆ సినిమా ప్రమోషన్ సమయంలోనే త్రివిక్రమ్‌ కంట పడింది. ఆ సమయంలోనే మీకు తప్పకుండా మంచి ఫ్యూచర్ ఉంటుంది. నా సినిమాలో ఆఫర్‌ ఇస్తాను అంటూ హామీ ఇచ్చాడు. అన్నట్లుగానే తన గుంటూరు కారం సినిమాలో ఆఫర్‌ ఇచ్చిన విషయం తెల్సిందే. ప్రస్తుతం మీనాక్షి చౌదరి చేస్తున్న సినిమాలు బ్యాక్‌ టు బ్యాక్‌ రాబోయే ఏడాది కాలంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. తప్పకుండా మీనూ మేడం మరింతగా క్రేజ్‌, స్టార్‌డం దక్కించుకోవడం ఖాయం.