ఒక మెట్టు కిందే మీనాక్షి ఎందుకు..?
టాలీవుడ్ లో హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో అదరగొట్టేస్తున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి.
By: Tupaki Desk | 6 Jun 2025 6:00 AM ISTటాలీవుడ్ లో హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో అదరగొట్టేస్తున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి. సుశాంత్ నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని చేస్తూ వచ్చింది. ఐతే మీనాక్షి సినిమాలు ఓ పక్క సూపర్ హిట్లు కొడుతున్నాయి.. మరికొన్ని డిజాస్టర్ లు అవుతున్నాయి. హిట్లు, ఫ్లాపులు అనేవి ఎవరికి సంబంధం ఉండదు. కానీ ఆ ఇంపాక్ట్ కచ్చితంగా కెరీర్ గ్రోత్ మీద పడుతుంది.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఈ ఇయర్ మొదట్లో సెన్సేషనల్ హిట్ అందుకుంది మీనాక్షి చౌదరి. ఐతే లాస్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో లక్కీ భాస్కర్ సక్సెస్ అందుకున్నా మెకానిక్ రాకీ, మట్కా సినిమాలు బోల్తా కొట్టాయి. ఆ సినిమాల్లో నటించడం వల్ల ఎంతోకొంత మీనాక్షి గ్రాఫ్ పడిపోయింది. ఐతే వెంకటేష్ సినిమాతో హిట్ అందుకున్నా మీనాక్షి మరో సూపర్ హిట్ పడితే కానీ ఆమె లక్కీ అన్నది చెప్పలేం.
మీనాక్షి సినిమాలు సక్సెస్ అవుతున్నా స్టార్ రేంజ్ కి వెళ్లడంలో వెనకబడుతుంది. ఎందుకో ఆమె ఒక మెట్టు కిందే ఉంటుందనిపిస్తుంది. మీనాక్షి యువ హీరోలతో చేయడమే దానికి కారణమా అన్నది కూడా తెలియాల్సి ఉంది. మీనాక్షి ఇప్పుడున్న రేంజ్ కన్నా హిట్లు కొట్టి స్టార్ ఛాన్స్ లు అందుకుని పాన్ ఇండియా వైడ్ గా అదరగొట్టేయాలి. ఐతే అలా జరగాలంటే ఆమె కెరీర్ ఇలా అప్ అండ్ డౌన్స్ లా ఉండకూడదు.
ప్రస్తుతం మీనాక్షి చౌదరి నవీన్ పొలిశెట్టితో అనగనగా ఒక రాజు సినిమా చేస్తుంది. దానితో పాటుగా నాగ చైతన్య కార్తీక్ దండు చేస్తున్న థ్రిల్లర్ మూవీలో కూడా నటిస్తుంది. ఈ రెండు సినిమాల మీద మీనాక్షి చాలా హోప్స్ పెట్టుకుంది. అటు తమిళం లో కూడా దళపతి విజయ్ తో చేసిన గోట్ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. అందుకే అమ్మడికి కోలీవుడ్ నుంచి ఛాన్స్ లు రావట్లేదు. మీనాక్షి స్టార్ ఫాం కొనసాగించాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు. ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాలు ఇంట్రెస్టింగ్ బజ్ తోనే వస్తున్నాయి కాబట్టి మీనాక్షి కి అంతా కలిసి వచ్చేలా ఉందని చెప్పొచ్చు. అంతేకాదు మరో రెండు సినిమాలు కూడా మీనాక్షి హీరోయిన్ గా చర్చల దశలో ఉన్నాయని తెలుస్తుంది.
